Sravana Bhargavi: హేమచంద్ర – శ్రావణ భార్గవి ల విడాకుల మేటర్ పై క్లారిటీ..!

గత కొంతకాలంగా సినీ రంగానికి చెందిన కపుల్స్ విడాకుల వార్తలతో చర్చనీయాంశం అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఏవేవో మనస్పర్థల కారణంగా వారు విడాకులు తీసుకుంటూ వార్తలకెక్కుతున్నారు. అయితే ఆ మనస్పర్థలు ఏంటి అన్నది మాత్రం వారు రివీల్ చేయరు.. ఏదో ఒక పోస్ట్ పెట్టి చేతులు దులిపేసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ టాలీవుడ్లో సమంత- నాగ చైతన్య జంట విడాకులు తీసుకున్నారు. ఈ వార్తని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే కోలీవుడ్ స్టార్ కపుల్స్ ఐశ్వర్య- ధనుష్ సైతం విడాకులు తీసుకోవడం,

బాలీవుడ్లో కూడా ఆమిర్ ఖాన్ దంపతులు విడిపోవడం ఇలా ప్రతి ఇండస్ట్రీలో ఇది కొంచెం ఎక్కువగా జరుగుతుంది.ఇదిలా ఉండగా.. టాలీవుడ్లో స్టార్ సింగర్లుగా పేరొందిన శ్రావణ భార్గవి, హేమచంద్ర…కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 2013లో వివాహం చేసుకున్న ఈ జంట 10 ఏళ్ళు కూడా కలిసుండకుండానే విడాకులకు రెడీ అవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఈ వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి స్పందించి క్లారిటీ ఇచ్చారు.

హేమచంద్ర తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయం పై స్పందిస్తూ.. “నా ఇండిపెండెంట్ సాంగ్స్ కంటే కూడా స్టుపిడ్ మరియు అనవసరమైన సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుంది. నా ఇంస్టాగ్రామ్ బయోలో ఓ ఇండిపెండెంట్ లవ్ సాంగ్ ఉంది దాన్ని వీక్షించండి’ అంటూ పేర్కొన్నాడు. అలాగే శ్రావణ భార్గవి ఈ విషయం పై స్పందిస్తూ.. “కొద్దిరోజులుగా నా యూట్యూబ్లో వ్యూస్ పెరిగాయి, ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా పెరిగారు.

ఇప్పుడు నాకు ఎక్కువ పని దొరుకుతుంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా సంపాదిస్తున్నాను. ఇది ఒకరకంగా శుభ పరిణామం… తప్పో ఒప్పో మీడియా అనేది ఒక ఆశీర్వాదం” అంటూ కామెంట్ పేర్కొంది. మొత్తంగా పరోక్షంగా ఈ వార్తలు అబద్దాలు అన్నట్టు ఈ స్టార్ సింగర్స్ రాసుకొచ్చారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus