Sravanthi: టాస్క్ లో స్రవంతి ఆ మాట చెప్పినందుకే ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకున్నారా ?

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో టాస్క్ లు ఫ్రెండ్షిప్ మద్యలో చిచ్చు పెట్టేస్తాయి. ఈ షో స్టార్ట్ అవ్వగానే అఖిల్, అజయ్, ముమైత్, స్రవంతి నలుగురు ఒక గ్రూప్ గా మారారు. ముఖ్యంగా స్రవంతి అజయ్ తో అఖిల్ తో మంచి బాండింగ్ ని ఏర్పరచుకుంది. ముమైత్ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత అషూరెడ్డి అఖిల్ కి కొద్దిగా క్లోజ్ అయ్యింది. అప్పట్నుంచీ అషూరెడ్డి ఇంకా అఖిల్ ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూనే ఉన్నారు.

అయితే, రీసంట్ గా ఇచ్చిన రోబో టాస్క్ స్రవంతిని ఈ గ్రూప్ కి దూరం చేసింది. గత వారం స్రవంతిని నామినేట్ చేసినందుకు స్రవంతి పెద్దగా ఫీల్ అవ్వలేదు. తన గేమ్ ని ఇంప్రూవ్ చేసినందుకే చూసుకుంది. రోబో టాస్క్ లో కూడా తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. కానీ, స్పేర్ పార్ట్స్ ని ఎక్కువగా కలక్ట్ చేయలేకపోయింది. బిట్ క్వాయిన్స్ ని సంపాదించలేకపోయింది. కేవలం రెండే రెండు క్వాయిన్స్ తో లీస్ట్ లో ఉండిపోయింది.

ఇక్కడే మిత్రా శర్మా కూడా 15 క్వాయిన్స్ తో లీస్ట్ లో ఉంది. అయితే, అజయ్ దగ్గర అసలు క్వాయిన్స్ ఏమీ లేవు. అఖిల్ కొన్ని క్వాయిన్స్ ఇచ్చి హెల్ప్ చేశాడు. బిగ్ బాస్ ఎనౌన్స్ మెంట్ చేసేశాక వీళ్లు క్వాయిన్స్ ని ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ విషయాన్ని చూసిన స్రవంతి సంచాలక్ అయిన మహేష్ కి చెప్పింది. దీంతో మహేష్ బిగ్ బాస్ నేను చూడలేదు, కానీ మీరు కన్సిడర్ చేస్తే ఒకే అన్నట్లుగా బిగ్ బాస్ కి డెసీషన్ వదిలేశాడు. బిగ్ బాస్ నుంచీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.

అందుకే, మొదటి రౌండ్ లో స్రవంతితో పాటుగా మిత్రాశర్మా ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది. సెకండ్ రౌండ్ కి ఛాన్స్ లేకుండా పోయింది. ఆ తర్వాత స్రవంతితో మాట్లాడిన అఖిల్ అండ్ టీమ్ ఈ విషయం ఎందుకు చెప్పావని నిలదీశారు. సంచాలక్ నాకు అప్పజెప్పాడని నా డ్యూటీ నేను చేశానని చాలా స్ట్రాంగ్ గా చెప్పింది స్రవంతి. కాసేపు వాళ్లతో ఆర్గ్యూమెంట్ చేసింది. మీరు ఇచ్చి పుచ్చుకుంటే తప్పులేదు కానీ, నేను చెప్తే తప్పు పడుతున్నారా అంటూ వాళ్లని నిలదీసింది.

వాళ్లతో ప్రెండ్షిప్ కట్ చేసేసుకుంది. బిందు మాధవికి వచ్చి తన బాధని చెప్పుకుంది. ఫస్ట్ వీక్ నుంచీ వాళ్లతోనే కలిసి ఉన్నాను, అయినా కూడా నామినేట్ చేశారు. గేమ్ లో హెల్ప్ కూడా చేయలేదు. ఇప్పుడు నేను చూసింది చెప్పినా కూడా తప్పు అయిపోయిందంటూ ఏడ్చింది. అంతేకాదు, తను అషూరెడ్డి దగ్గర బొమ్మలని తీసుకున్న విషయం కూడా అషూకి చెప్పేశారని చెప్పింది. వాళ్లు చెప్తే తప్పులేద కానీ, నేను చెప్తే తప్పు ఎట్లా అవుతుందని బాధపడింది.

ఇక స్రవంతి సంచాలక్ కి చెప్పిన ఈ ఒక్క మాట వల్లే వాళ్లతో ప్రెండ్షిప్ అనేది కట్ అయిపోయిందనే చెప్పాలి. అంతేకాదు, ఈవారం ఓటింగ్ లో చూసినట్లయితే.. స్రవంతి లీస్ట్ లోనే ఉంది. ముమైత్ ఖాన్, స్రవంతి , అషూరెడ్డి ముగ్గురూ కూడా లీస్ట్ లోనే ఉన్నారు. ఒకవేళ ఈవారం స్రవంతి ఎలిమినేట్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా అఖిల్ అండ్ టీమ్ బాధపడతారు. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus