Sree Mukhi Marriage: తన పెళ్లి అప్పుడే అంటున్న శ్రీముఖి!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిజీ యాంకర్లలో ఒకరైన శ్రీముఖి బుల్లితెర ఆఫర్లతో పాటు వెండితెర ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ సినిమా ఈ నెల 19వ తేదీన రిలీజ్ కానుండటంతో శ్రీముఖి సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమాపై అంచనాలను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. క్రేజీ అంకుల్స్ ప్రమోషన్లలో శ్రీముఖి వ్యక్తిగత విషయాల గురించి కూడా వెల్లడిస్తున్నారు. రాజా రవీంద్ర, భరణి, మనో ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

గతంలో శ్రీముఖి లీడ్ రోల్ లో కొన్ని సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. క్రేజీ అంకుల్స్ సినిమాపైనే శ్రీముఖి చాలా ఆశలు పెట్టుకున్నారు. పెళ్లి గురించి ఎదురైన ప్రశ్నలకు స్పందిస్తూ తాను కూడా పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని శ్రీముఖి చెప్పుకొచ్చారు. అయితే మంచి వ్యక్తి దొరకడానికి సమయం పడుతుందని శ్రీముఖి అన్నారు. మన ఫేట్ పైనే ఏదైనా ఆధారపడి ఉంటుందని శ్రీముఖి కామెంట్లు చేశారు.

నాకు 31 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలని ఉందని శ్రీముఖి వెల్లడించారు. క్రేజీ అంకుల్స్ సినిమాలో అపార్ట్ మెంట్‌లో దిగిన గ్లామరస్ అమ్మాయి పాత్రలో శ్రీముఖి నటిస్తుండగా ఆమెను పడేయడానికి ప్రయత్నించే అంకుల్స్ ఎలాంటి తిప్పలు పడ్డారనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని శ్రీముఖి అభిమానులు ఆశిస్తున్నారు. శ్రీముఖి ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus