Bhala Thandhanana Teaser: ఆకట్టుకుంటున్న శ్రీవిష్ణు ‘భళా తందనాన’ టీజర్‌..!

వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు నుండీ రాబోతున్న తదుపరి చిత్రం ‘భళా తందనాన’ . ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి ఈ చిత్రానికి దర్శకుడు.సాయి కొర్రపాటి సమర్పణలో ‘వారాహి చలన చిత్రం’ బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ హీరోయిన్ గా నటిస్తుంది.మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టీజర్‌ ను కొద్దిసేపటి క్రితం నేచురల్ స్టార్ నాని విడుదల చేసాడు.

‘రాక్షసుణ్ణి చంపడానికి దేవుడు కూడా అవతారలెత్తాలి… నేను మాములు మనిషిని…’ అంటూ శ్రీవిష్ణు చెప్పే ఇంటెన్సిటీ డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది. హీరోయిన్ కేథరిన్ ఓ ఇగోయిస్టు పాత్రలో కనిప్పిస్తుంది.అయితే ‘నీ దారిలో నువ్వు… నా దారిలో నేను… ఇద్దరి లక్ష్యం ఒకటే…’ అంటూ శ్రీవిష్ణు పలికిన డైలాగ్ ను బట్టి ఇద్దరిదీ ఒకే లక్ష్యమని తెలుస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ రామచంద్రరాజు ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు.

మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి.మొత్తానికి సగటు ప్రేక్షకుడు కోరుకునే కమర్షియల్ అంశాలు అన్నీ టీజర్లో దట్టించారు. శ్రీవిష్ణు మంచి కథల్ని ఎంచుకుంటున్నప్పటికీ ఆశించిన స్థాయిలో కమర్షియల్ హిట్లను మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఈ ‘భళా తందనాన’ తో అతనికి ఆ లోటు తీరుతుందేమో చూడాలి. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!


చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus