Sree Vishnu: సామజవరగమన మూవీతో ఆ బయ్యర్ కు బంపర్ ఆఫర్ దక్కిందా?

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సామజవరగమన మూవీ చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా శ్రీవిష్ణు మార్కెట్ ను సైతం పెంచేసింది. సింపుల్ కథతో ఆసక్తికర ట్విస్టులతో తెరకెక్కిన ఈ సినిమాలో కథ, కథనం రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంటాయి. ప్రధాన పాత్రలకు కీలక నటీనటులను ఎంచుకోవడం కూడా ఈ సినిమా సక్సెస్ కు ఒక విధంగా కారణమని చెప్పవచ్చు. ఏజెంట్ సినిమా నిర్మాత అనిల్ సుంకరకు భారీ నష్టాలను మిగల్చగా ఈ సినిమా మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లాభాలను అందిస్తోంది.

వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న నిర్మాత అనిల్ సుంకర సామజవరగమన, భైరవ కోన సినిమాల ఓవర్సీస్ హక్కులను కేవలం కోటిన్నర రూపాయలకు ఓవర్సీస్ బయ్యర్ కు అమ్మేశారు. అయితే సామజవరగమన ఇప్పటివరకు ఏకంగా మూడు కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఫుల్ రన్ లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. శ్రీవిష్ణు కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీవిష్ణు తర్వాత సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. మంచి కథలను ఎంచుకుంటే శ్రీవిష్ణు కెరీర్ మరింత బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవిష్ణు పారితోషికం 3 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. శ్రీవిష్ణు క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

శ్రీవిష్ణు (Sree Vishnu) రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలను సృష్టించి సినిమాల విషయంలో రికార్డులు క్రియేట్ చేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమా సినిమాకు శ్రీవిష్ణు రేంజ్ పెరుగుతుండగా శ్రీవిష్ణును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus