Kalyan Dev: ఆమె సీమంతపు వేడుకలలో కళ్యాణ్ దేవ్..పోస్ట్ వైరల్!

Advertisement

కళ్యాణ్ దేవ్ పరిచయం అవసరం లేని పేరు ఈయన చిరంజీవికి చిన్నల్లుడిగా అందరికీ ఎంతో సుపరిచితమే ఇలా శ్రీజను పెళ్లి చేసుకున్న తర్వాత కళ్యాణ్ హీరోగా పలు సినిమాలలో నటించారు. ఇక శ్రీజ కళ్యాణ్ దంపతులకు నవిష్క అనే కుమార్తె కూడా జన్మించారు. అయితే పాప జన్మించిన తర్వాత వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంతో విడిపోయారు. అయితే ఈ విషయాన్ని మాత్రం ఇప్పటివరకు అధికారకంగా ఎక్కడ తెలియజేయలేదు. ఇలా శ్రీజకు దూరంగా ఉంటున్నటువంటి కళ్యాణ్ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఇకపోతే ఇటీవల ఈయన సోషల్ మీడియా వేదికగా సీమంతపు ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే ఆ వేడుక తన చెల్లెలు ఐశ్వర్యకు సంబంధించిన వేడుక అని తెలుస్తుంది. ఈయన తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. గతంలో తన తల్లి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే తన (Kalyan Dev) చెల్లెలు ఐశ్వర్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో తన చెల్లెలు సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ వేడుకకు ఈయన కుమార్తెను నవిష్క కూడా హాజరైనట్టు తెలుస్తుంది.ఇలా ఈ వేడుకకు సంబంధించినటువంటి ఫోటోలను కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మీ అందరి ప్రేమ అభిమానాలతో నా కుటుంబం ఇంకా పెరుగుతుంది అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలలో చిన్నారి నవిష్క స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus