Sreeja Konidela: మనసు విరిగిన.. పరిస్థితులు చేయి జారిపోయిన అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన శ్రీజ!

మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన వ్యక్తిగత కారణాలవల్ల పెద్ద ఎత్తున వార్తలు నిలిచారు. అయితే తాజాగా మెగా కుటుంబ సభ్యులందరూ కూడా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలలో సంతోషంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేయగా శ్రీజ మాత్రం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

సోషల్ మీడియా వేదికగా శ్రీజ (Sreeja Konidela) చేసినటువంటి ఈ పోస్ట్ బట్టి చూస్తుంటే ఈమె ఏ విషయంలోనో బాగా హర్ట్ అయ్యారని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సందర్భంగా ఈమె తన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పరిస్థితులు మన నియంత్రణలో లేనప్పుడు, పరిస్థితిలో అస్తవ్యస్తంగా మారినప్పుడు గుండె బరువెక్కడ మనసు విరిగిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో మన శరీరం కూడా బలహీన పడుతుంది.

మన జీవితంలో కష్టాలు వచ్చినా.. నష్టాలు వచ్చినా.. పరిస్థితులు చేయి జారిపోయిన, గుండె ముక్కలైన మనసు విరిగిపోయిన ఒక్కసారి కళ్ళు మూసుకుని మన లోపలికి మనం వెళ్తే అన్ని సెట్ అవుతాయి. కష్టాలు వచ్చినప్పుడు మనందరి ముందు ఉన్నటువంటి ఏకైక దారి ఇదే అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు కూడా ఈమె పోస్టుపై ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి ఒక్కరూ కూడా పెళ్లి వేడుకలలో ఎంతో సంతోషంగా ఉండగా శ్రీజ మాత్రం ఎందుకు ఇలాంటి పోస్ట్ చేశారు. బహుశా ఈ పెళ్లి వేడుకలలో ఈమెను ఎవరైనా బాధపెట్టారా లేక ఏ విషయంలోనైనా ఈమె తన గతాన్ని తలుచుకొని బాధపడ్డారా అందుకే ఇలాంటి పోస్ట్ చేశారా అంటూ పెద్ద ఎత్తున శ్రీజ పోస్టుపై ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus