Sreeleela: శ్రీలీల పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి కావాల్సిన లక్షణాలివే.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 30 లక్షల రూపాయల పారితోషికంతో కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీలీల ప్రస్తుతం 8 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు. శ్రీలీల తాజాగా సైమా అవార్డ్ ను సొంతం చేసుకోవడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ధమాకా సినిమాలోని యాక్టింగ్ కు శ్రీలీలకు ఈ అవార్డ్ వచ్చింది. అయితే శ్రీలీల తాజాగా ఒక సందర్భంలో తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాల గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

నా ఫస్ట్ లవ్ మమ్మీ అని అమ్మను తప్ప తాను ఇప్పటివరకు మరెవరినీ ప్రేమించలేదని ఆమె అన్నారు. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి మాటలో నిలకడ ఉండాలని సరదాగా ఉండాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి విషయంలో ఓపికగా వ్యవహరించాలని నేర్పరితనం కలిగి ఉండాలని పెద్దవారిని గౌరవించాలని శ్రీలీల అన్నారు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పుకొచ్చారు.

అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి శ్రీలీలకు ఎప్పుడు దొరుకుతాడో చూడాల్సి ఉంది. శ్రీలీల ఇప్పట్లో పెళ్లి చేసుకునే అవకాశాలు అయితే లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. శ్రీలీల రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో శ్రీలీల ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

శ్రీలీల (Sreeleela) సోషల్ మీడియాలో సైతం మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. ఇతర భాషలపై శ్రీలీల దృష్టి పెడితే ఆమె దూకుడుకు బ్రేకులు వెయ్యడం సాధ్యం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలీల తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుని మరిన్ని భారీ విజయాలను సొంతం చేసుకుంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus