Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్ కాదంట
- July 17, 2026 / 04:38 PM ISTByFilmy Focus Desk
ఇన్నాళ్లూ కామ్‌గా ఉన్న అజిత్ టీమ్.. గత రెండు మూడు రోజులుగా వరుస సమాచారాలు బయటకు లీక్‌ల ద్వారా ఇస్తోంది. అలాగే ఈ సినిమా గురించి తమిళ సినిమా వేగులు కూడా వరుస వార్తలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. గతంలో ఎప్పుడో వేరే సినిమా విషయంలో జరిగే అవకాశం ఉంది అంటూ వచ్చిన వార్త.. ఇప్పుడు ఈ సినిమా విషయంలో అవుతోందట. అదే ఈ సినిమాలో శ్రీలీల భాగం కావడం.
Sreeleela
గత కొన్ని సినిమాల నుండి శ్రీలీల కెరీర్ ఏ మాత్రం సరిగ్గా లేదు. ఏదైనా సరైన విజయం పడాలి అనుకుంటుండగా.. మంచి విజయం అందుకున్న సినిమా నుండి ఆమె బయటకు వెళ్లిపోవడం ఆమె అభిమానులను బాధపెట్టింది. అయితే వెంటనే మరో ఇంట్రెస్టింగ్ కాంబోలో నటిస్తోందనే విషయం బయటకు రావడంతో తిరిగి ఫ్యాన్స్ యాక్టివేట్ అయ్యారు. ఆ సినిమా అజిత్ – అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త ఈ సినిమా. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర హీరోయిన్ కాదు.

అజిత్‌కి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లాంటి సినిమా ఇచ్చిన అధిక్ రవిచంద్రన్ డైరక్షన్‌లో వస్తుండటంతో ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా ఆశించిన భారీ విజయం అందుకోకపోయినా.. అజిత్‌ను చూపించిన విధానం ఫ్యాన్స్‌కి నచ్చేసింది. ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని అజిత్ భార్య షాలిని చూస్తున్నారట. ఇప్పటికే సినిమా పనులు ఆమె స్టార్ట్ చేసేశారు అని అంటున్నారు. సినిమా ప్రారంభం సమయంలో ఈ విషయంలో మరికొంత క్లారిటీ వస్తుంది.
ఇక మరో టాపిక్ చూసుకుంటే ఈ సినిమా కోసం హీరోయిన్ ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టారు. గ్లామర్, యాక్టింగ్ కలగలిపిన భామ కోసం చూస్తున్నారట. ఈ క్రమంలో లేటెస్ట్ సెన్సేషన్ కయాదు లోహర్‌ను ఎంపిక చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇప్పటికే ఆమెను ఈ విషయంలో కాంటాక్ట్ అయ్యారు సమాచారం. సినిమా ఓపెనింగ్ సమయంలో హీరోయిన్ ఎంట్రీ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఇప్పటివరకు శ్రీలీల ఒక తమిళ సినిమా చేసింది. అదే శివకార్తికేయన్ ‘పరాశక్తి’. ఈ సినిమాకు ఆశించిన ఫలితం రాలేదు. ఇటీవల ‘ఓం: చాప్టర్ 1’ అనే సినిమా స్టార్ట్ చేసింది.













