Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా… హీరోయిన్‌ మారిపోయిందట!

గౌతమ్‌ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) ‘జెర్సీ’ (Jersey) సినిమాలతో బాగా పాపులర్‌ అయ్యారు. అయితే ఏముంది ఇప్పుడు తెలుగులో కొత్త సినిమా ప్రారంభిస్తాను అంటే ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఆయన అనుకుననది అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ పాటికి సినిమా రిలీజ్‌ అయిపోయేది. అన్నీ బాగుంటే స్టార్‌ డైరక్టర్‌ కూడా అయిపోయేవారు. అయితే రామ్‌చరణ్‌ నో (Ram Charan) చెప్పడం, విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) యస్‌ చెప్పడంతో సినిమా ఇటు వచ్చేసింది. కానీ ఇక్కడా సినిమా మొదలవ్వలేదు.

ఆ మాటకొస్తే సినిమాలో ఏదో ఒక మార్పు వస్తూనే ఉంది. గతంలో చెప్పిన ప్రకారం అయితే ‘ఫ్యామిలీ స్టార్‌’ (The Family Star) బదులు గౌతమ్‌ తిన్ననూరి సినిమా పట్టాలెక్కాల్సి ఉండే కానీ అవ్వలేదు. ఇప్పుడు ఆ సినిమా పనులు అయిపోయాయి కాబట్టి ఇక విజయ్‌ ఈ సెట్స్‌ మీదకు వస్తాడు అనుకుంటే… హీరోయిన్‌ సంగతి ఇంకా తేలలేదు అంటున్నారు. అవును గతంలో అనుకున్న శ్రీలీల (Sreeleela) కాకుండా వేరే హీరోయిన్‌ను ఓకే చేసే పనిలో ఉందట టీమ్‌.

ఈ మేరకు ఇద్దరు యంగ్‌ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అందులో ఒకరు ఇటీవల ‘ప్రేమలు’ (Premalu) కురిపించిన మమిత (Mamitha Baiju) అయితే… మరో నాయిక ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan) భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) అంటున్నారు. సినిమాలో కాస్తంత బోల్డ్‌ సీన్స్‌ ఉంటాయని వాటికి మమిత అంతగా బాగోదు కాబట్టి… భాగ్యశ్రీని ఓకే చేస్తారని మరో టాక్‌ కూడా వినిపిస్తోంది. అయితే ఇద్దరిలో ఎవరు ఓకే అయ్యారు అనే విషయంలో ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది అంటున్నారు.

‘ఫ్యామిలీస్టార్‌’ సినిమతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్‌ దేవరకొండ మిశ్రమ స్పందన ఎదుర్కొంటున్నారు. హిందీ ‘జెర్సీ’తో గౌతమ్‌ పరిస్థితీ ఇంతే. దీంతో ఈ సినిమా ఇద్దరికీ కీలకంగా మారింది. అన్నట్లు విజయ్‌ గ్యాప్‌ ఇచ్చిన ఈ టైమ్‌లో గౌతమ్‌ తిన్ననూరి మరో చిన్న సినిమాను పూర్తి చేశారట. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేస్తారు అంటున్నారు. మరి ఆ సినిమా ఏంటి అనేది చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus