Sreeleela: ఆ ఒక్క కారణంతోనే ఈ సినిమాకు ఒప్పుకున్నా: శ్రీలీల

నందమూరి నటసింహం బాలకృష్ణ కేవలం సినిమాలలో హీరోగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా మెప్పించారనే విషయం మనకు తెలిసిందే. ఈయన ఆహాలో ప్రసారమవుతున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ కార్యక్రమం మొదటి రెండు సీజన్లు ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే మూడవ సీజన్ కూడా ప్రారంభించారు. మూడవ సీజన్లో భాగంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 17వ తేదీ రాత్రి నుంచి ఆహాలో అందుబాటులోకి వచ్చింది.

మొదటి ఎపిసోడ్ లో భాగంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి టీం నుంచి డైరెక్టర్ అనిల్ రావిపూడి, అర్జున్ రామ్ పాల్, శ్రీ లీల , కాజల్ అగర్వాల్ హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ సినిమాల గురించి రాజకీయాల గురించి మాట్లాడుతూ తనదైన స్టైల్ లో ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో బాలయ్య శ్రీ లీల మాట్లాడుతూ అసలు ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది?ఎందుకు ఈ సినిమాకు ఒప్పుకున్నారు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు శ్రీలీల సమాధానం చెబుతూ నేను నటించిన పెళ్లి సందడి సినిమా సమయంలోనే నాకు ఈ సినిమా కథ వినిపించారు. అప్పటికే నాకు హీరోయిన్గా చాలా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. అలాంటి సమయంలో కూతురి పాత్ర అంటే చాలామంది ఈ సినిమాని ఒప్పుకోవద్దు నో చెప్పు అంటూ నాకు సలహా ఇచ్చారు. ఇలా ఈ సినిమాలో కూతురి పాత్ర అంటే హీరోయిన్గా కెరియర్ దెబ్బతింటుందని అందుకే ఈ సినిమాను రిజెక్ట్ చేయమని చాలా మంది చెప్పారు.

అయితే హీరోయిన్ గా నేను ఎన్ని సినిమాలైనా చేయవచ్చు కానీ ఇలా కూతురి పాత్రలో నటించే అవకాశాలు వస్తాయో రావు తెలియదు. వచ్చినప్పుడే ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నాను అందుకే ఈ సినిమాకు కమిట్ అయ్యానని తెలిపారు. నేను కెరియర్ పరంగా తీసుకున్న బెస్ట్ నిర్ణయం ఏదైనా ఉంది అంటే ఈ సినిమాకు కమిట్ అవ్వడమే అంటూ శ్రీ లీల (Sreeleela) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus