Sreeleela: ఇంటిలో కంటే అక్కడే ఎక్కువ ఉంటున్న హీరోయిన్ శ్రీలీల!

పెళ్లిసందడి మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు యువ నటి శ్రీలీల. ఆ మూవీలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆకట్టుకున్న శ్రీలీల, అనంతరం రవితేజ తో చేసిన ధమాకా మూవీతో మరొక సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వరుసగా అనేక సినిమా అవకాశాలతో కొనసాగుతున్నారు శ్రీలీల.

ఇక తాజగా ఒక ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూ లో భాగంగా (Sreeleela) శ్రీలీల మాట్లాడుతూ, ప్రస్తుతం వరుసగా సినిమాలతో అసలు ఖాళీ లేదు. నిజానికి ఇంట్లో కంటే సెట్స్ లోనే ఎక్కువగా టైం గడుపుతున్నాను అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. నిజం చెప్పాలంటే నేటికీ ప్రేక్షకులు సినిమా విడుదలయ్యాక మొదటి రోజు టికెట్స్‌ను హీరోల కోసమే కొంటున్నారు. నేను ఈ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను. సినిమాలో నాకు ఎక్కువ ప్రాధాన్యం ఉండాలని.. అంతా నేనే కనిపించాలని అనుకోను.

మంచి పాత్ర అయితే చాలు. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలనుకుంటాను. ప్రతి చిత్రంలోనూ విభిన్నంగా కనిపించాలని కోరుకుంటా. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాను. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండడం లేదు. ఇంట్లో కంటే సెట్స్‌, షూటింగ్‌లలోనే ఎక్కువ సమయం ఉంటున్నాను. నా వర్క్‌ను చాలా ఎంజాయ్‌ చేస్తున్నాను. కెమెరా ముందు ఉండడం నాకు ఒక వ్యసనంగా మారిపోయింది. అని చెప్పింది. ఈ సినిమాలను పూర్తి చేయాలని ఉద్దేశంతో తెగ కష్టపడిపోతుందట ముద్దుగుమ్మ.

రోజుకు 2 షిఫ్టుల్లో పనిచేస్తుందని సమాచారం. 7 సినిమాలు ఒకే చేస్తుండటంతో రోజుకు 16 గంటల చొప్పున 2 షిఫ్టుల్లో వర్క్ చేస్తోందట. ఈ ఏడు ప్రాజెక్టుల కూడా పెద్ద సినిమాలు కావడం విశేషం. శ్రీలీల మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

దీంతో పాటు పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఛాన్స్ కొట్టేసింది. అలాగే యువ హీరోలైన రామ్ పోతినేని, నితిన్, విజయ్ దేవరకొండతో సినిమాలకు పచ్చ జెండా ఉపేసింది. ఇవి కాకుండా బాలయ్య-అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మూవీలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus