NTR30: తారక్ కు జోడీగా ఆ హీరోయిన్ ను ఎంపిక చేస్తారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో బిజీగా ఉండగా ఈ నెలలో ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సినిమాలో తారక్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్ అయినా ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించడానికి మేకర్స్ ఇష్టపడటం లేదు. తారక్ సైతం ఈ సినిమా గురించి అప్ డేట్స్ ఇచ్చినా ఈ సినిమాలో తారక్ కు జోడీగా నటించే లక్కీ బ్యూటీకి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.

అయితే తారక్ ఫ్యాన్స్ మాత్రం తారక్ శ్రీలీల కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అని ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని చెబుతున్నారు. తారక్ కు జోడీగా శ్రీలీలను ఎంపిక చేస్తే చూడాలని ఉందని అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలీల మంచి డ్యాన్సర్ కావడంతో ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో క్రేజ్ పెరుగుతోంది. కొరటాల శివ మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఉంటే మాత్రం ఆ పాత్రకు శ్రీలీలను ఎంపిక చేస్తే మంచిది.

ఎన్టీఆర్ శ్రీలీల కాంబోకు సంబంధించి అధికారిక ప్రకటన రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ కు జోడీగా ఛాన్స్ అంటే శ్రీలీల నో చెప్పే అవకాశం ఉండదు. మరోవైపు తారక్ సీరియస్ కావడంతో అప్ డేట్స్ విషయంలో ఒకింత ఓపికతో వ్యవహరించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ కు కోపం తెప్పించే విధంగా వ్యవహరించకూడదని అభిమానులు భావిస్తున్నారని బోగట్టా.

తారక్ ప్లానింగ్ విషయంలో ఒకింత గందరగోళం నెలకొన్నా సినిమా షూటింగ్ మొదలైతే మాత్రం సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా కొరటాల శివ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. జనతా గ్యారేజ్ కాంబో బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులు రిపేర్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus