Disco Shanti: శ్రీహరి భార్య డిస్కో శాంతి ఎమోషనల్ కామెంట్స్!

దాసరి నారాయణరావు గారు సినీ పరిశ్రమకు పరిచయం చేసిన గొప్ప నటుల్లో శ్రీహరి కూడా ఒకరు. నెగిటివ్ రోల్స్ తో ఎంట్రీ ఇచ్చిన ఆయన అటు తర్వాత విలన్ గా కూడా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.అటు తర్వాత హీరోగా కూడా మారి ఎన్నో సందేశాత్మక చిత్రాల్లో నటించారు.అందులో కొన్ని సూపర్ హిట్ అయ్యాయి. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకి ఈయన కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు.

హీరోగా చేస్తూనే మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘కింగ్’ ‘ఢీ’ ‘మహానంది’ ‘మగధీర’ వంటి హిట్ సినిమాల్లో సహాయ నటుడిగా నటించారు. అదే టైంలో ప్రభుదేవా సినిమా కోసం ముంబై వెళ్లిన ఆయన అనారోగ్యం పాలై .. తర్వాత లీలావతి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన పర్సనల్ లైఫ్ కూడా అందరికీ సుపరిచితమే. 1996 లో ఈయన డిస్కో శాంతిని ప్రేమ వివాహం చేసుకున్నారు.

అప్పటికి ఆమె ఐటమ్ సాంగ్స్ తో భీభత్సమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా అటు తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో కూడా డిస్కో శాంతి చాలా చిత్రాల్లో నటించారు. శ్రీహరి మరణానికి కారణం వైద్యుల నిర్లక్ష్యమే అని ఓ సందర్భంలో చెప్పిన ఆమె ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.

వీటి పై ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. (Disco Shanti) డిస్కో శాంతి మాట్లాడుతూ.. “శ్రీహరి మరణం తర్వాత మమ్మల్ని ఒక్క సారిగా అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఆ టైంలో మేము చాలా డబ్బు పోగుట్టుకున్నాం. ఆ డబ్బే ఉండి ఉంటే నా పిల్లలను విదేశాలకు పంపించి చదివించేదాన్ని. శ్రీహరి బ్రతికున్న రోజుల్లో ఎంతో మందికి ఆర్థిక సాయం చేశారు.

కానీ ఎవ్వరూ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. కానీ మేము ఎవరి దగ్గరైతే అప్పు తీసుకున్నామో, వాళ్ళు మాత్రం మా ఇంటికి వచ్చి నానా రచ్చ చేసేవారు. అప్పుడైనా మా దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళు మమ్మల్ని ఆదుకోలేదు. వాళ్ళు ఆ టైంకి బాగానే ఉన్నారు. అయినా తిరిగి సాయం చేయలేదు. దీంతో కార్లు, భూమి, బంగారం అన్నీ అమ్మేయాల్సి వచ్చింది. ఒక్క తాళిబొట్టు తప్ప నా దగ్గర ఏమీ మిగల్లేదు” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus