Sri Simha: సింహా కోడూరికి అలా కలిసొచ్చేసింది.!

  • September 17, 2024 / 09:38 AM IST

కీరవాణి (M. M. Keeravani) తనయుడు శ్రీ సింహా కోడూరి (Sri Simha Koduri)  హీరోగా పరిచయమయ్యి 5 ఏళ్ళు కావస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఇతను బాగా ఫేమస్. రాజమౌళి (S. S. Rajamouli) తెరకెక్కించిన ‘యమదొంగ’ (Yamadonga) ‘మర్యాదరామన్న’ (Maryada Ramanna) వంటి సినిమాల్లో నటించాడు.’ఈగ’ (Eega) లో కూడా సమంతకి   (Samantha)  ఫ్రెండ్ రోల్ చేశాడు. ఆ తర్వాత సుకుమార్  (Sukumar) తెరకెక్కించిన ‘రంగస్థలం’ (Rangsthalam)  చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశాడు. 2019 లో వచ్చిన ‘మత్తు వదలరా’ (Mathu Vadalara)  తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అది మంచి సక్సెస్ అందుకుంది.

Sri Simha

సో సింహా టాప్ రేంజ్ కి వెళ్తాడు అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిది జరగలేదు.దాని తర్వాత సింహా చేసిన ‘తెల్లవారితే గురువారం’ ‘దొంగలున్నారు జాగ్రత్త’ (Dongalunnaru Jagratha) ‘భాగ్ సాలే’ (Bhaag Saale) ‘ఉస్తాద్’ (Ustaad)వంటి సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైంలో ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2)   చేశాడు. రితేష్ రానా (Ritesh Rana) డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది.

అయితే ఈ సినిమా మేజర్ క్రెడిట్ అంతా సత్యనే పట్టుకుపోయాడు అని అంతా అభిప్రాయపడుతున్నారు. సినిమాలో ఎవరు ఎంత బాగా చేసినా.. సక్సెస్ క్రెడిట్ లో మొదటి పేరు హీరోదే ఉంటుంది.’సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) వంటి సినిమాలో ఎస్.జె.సూర్య   (SJ Suryah)  ఎంత బాగా చేసినా.. హిట్టు పడింది నాని (Nani) ఖాతాలోనే. సో ఆ రకంగా చూసుకుంటే సత్యని (Satya) అడ్డం పెట్టుకుని సింహా గట్టెక్కేసినట్టే. కానీ ఇక నుండి కథల ఎంపిక విషయంలో, నటన విషయంలో ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది.

దేవర విషయంలో ఆ టెన్షన్ వద్దన్న కొరటాల శివ.. ఏం చెప్పారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus