Sridevi, Boney Kapoor: శ్రీదేవి, బోనీ కపూర్ రెండు సార్లు పెళ్ల చేసుకోవడానికి కారణం అదేనా..!

అలనాటి అందాల తార శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ల వివాహంపై నేటికీ ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే జాన్వీకపూర్‌ కూడా వారికి పెళ్లికి ముందే పుట్టారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బోనీ కపూర్ ఆ వార్తలకు చెక్‌ పెట్టారు. ఆ రూమర్‌ ఎలా పుట్టిందో వివరించారు. ‘నేనూ శ్రీదేవి 1996లో షిర్డిలో రహస్య వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత కొన్ని నెలలకు మా పెళ్లి విషయాన్ని మీడియాకు వెల్లడించాం.

1997లో జనవరిలో మరోసారి పబ్లిక్‌గా పెళ్లిచేసుకున్నాం. ఈ విషయాన్ని అధికారికంగా మీడియాకు చెప్పాం. దాంతో అనేక రూమర్లు మొదలయ్యాయి. జాన్వీ కపూర్‌ 1997 మార్చిలో పుట్టింది. అయితే, జాన్వీ మా పెళ్లికి ముందే పుట్టిందని కొన్ని మీడియాల్లో అప్పుడు వార్తలు వచ్చాయి. అవే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తన పుట్టినరోజు గురించి ఎన్ని సార్లు వివరించినా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు’ అని చెప్పారు. అలాగే శ్రీదేవికి దేవుడుపై ఎంతో నమ్మకమని బోనీ కపూర్‌ అన్నారు.

తన ప్రతి పుట్టినరోజుకు తిరుమల వెళ్లేవారని ఆయన చెప్పారు. అలానే ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా ప్రతి మూడు నెలలకు కచ్చితంగా తిరుమల వెళ్తుంటుందని బోనీ కపూర్ అన్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో శ్రీదేవి మరణం గురించి కూడా బోనీ కపూర్ మాట్లాడారు.

స్క్రీన్‌పై అందంగా కనిపించడం కోసం శ్రీదేవి (Sridevi) తరచూ ఆహార నియమాలు పాటించేవారని చెప్పారు. ఉప్పు లేకుండా భోజనం చేసేవారని దాని కారణంగా ఆమె నీరసంతో పడిపోయిన సందర్భాలూ ఉన్నాయని తెలిపారు. ఆమె మరణంలో ఎలాంటి కుట్రకోణం లేదని పోలీసులు నిర్ధారించినట్లు చెప్పారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus