Sridevi: శ్రీదేవి మరణానికి అదే కారణమా.. ఇన్నేళ్లకు బయటపెట్టిన బోనీకపూర్!

ప్రముఖ సినీ నటి శ్రీదేవి ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే .ఈమె అగ్రతారగా ఇండస్ట్రీలో అన్ని భాషలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీదేవి 2018 సంవత్సరం తను బంధువుల పెళ్లి కోసం దుబాయ్ వెళ్ళగా అక్కడ మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే శ్రీదేవి ఉన్నఫలంగా ఇలా మరణించడానికి సరైన కారణాలు తెలియలేదు ఇప్పటికీ ఈమె డెత్ మిస్టరీగానే ఉందని చెప్పాలి.

ఇలా శ్రీదేవి మరణం పై ఎన్నో అనుమానాలు కూడా ఉన్నాయి .అయితే ఈమె మరణించిన ఇన్ని సంవత్సరాలకు తాజాగా శ్రీదేవి భర్త బోనికపూర్ శ్రీదేవి మరణం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. శ్రీదేవి మరణం సహజ మరణం కాదని ఈయన వెల్లడించారు. ఆమె మరణం ప్రమాదవశాత్తు జరిగింది అంటూ ఈ సందర్భంగా బోనీకపూర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

శ్రీదేవి సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం కోసం విపరీతమైనటువంటి డైట్ చేసేవారు. ఆ విషయం నాకు పెళ్లయిన తర్వాతనే తెలిసింది. ఆమె ఆహారం తీసుకుంటే ఉప్పు అసలు వేసుకోరు. ఇలా ఉప్పు లేనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల కళ్లు తిరిగి పడిపోయేదని ఈయన వెల్లడించారు. ఇలా లో బీపీ కారణంగానే శ్రీదేవి ఆరోజు కూడా కళ్ళు తిరిగి పడిపోయి ప్రమాదవశాత్తు మరణించి ఉంటుందని ఈయన ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక శ్రీదేవి (Sridevi) చనిపోయిన తర్వాత నాగార్జున కూడా ఓ సినిమా షూటింగ్ సమయంలో తాను అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది అనే విషయాన్ని వెల్లడించారు. ఇక శ్రీదేవి మరణించిన తర్వాత దుబాయ్ పోలీసులు తనని ఒక రోజంతా కూడా విచారణ చేశారని ఇక్కడ పోలీసుల ఒత్తిడితో లై డిటెక్టర్ కూడా నాపై ఉపయోగించారు అంటూ ఈ సందర్భంగా బోనీకపూర్ శ్రీదేవి మరణం గురించి తెలియజేశారు. ఈయన మాటలు బట్టి చూస్తే బహుశా ఆరోజు కూడా లోబీపీ కారణంగానే ఈమె కళ్ళు తిరిగి పడిపోయారా అందుకే మరణించారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus