Srihan, Inaya: నామినేషన్స్ లో శ్రీహాన్ , ఇనయ అతి..! మేటర్ లేకుండా కౌంటర్స్..!

బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన దగ్గర్నుంచీ కూడా ఇయనకి , శ్రీహాన్ కి అస్సలు పడట్లేదు. ఫస్ట్ వీక్ నుంచీ కూడా ఇద్దరూ ఎందుకో కనెక్ట్ కాలేకపోయారు. 7 వారాలు అవుతున్నా కూడా ఇంకా చిన్న చిన్న రీజన్స్ కి నామినేషన్స్ లో ఫైట్ చేసుకుంటూనే ఉన్నారు. నిజానికి మద్యలో ఇనయ గాలి సూర్యవైపు మళ్లింది. సూర్యతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ తన గేమ్ లో వెనకబడిపోయింది.

ఈవిషయాన్ని నాగార్జున వీకండ్ చెప్పేసరికి మరోసారి శ్రీహాన్ తో సై అంటే సై అంటూ రెచ్చిపోయింది. శ్రీహాన్ ఇనయని పిట్ట అని ఏడిపించినప్పటి నుంచీ వీరిద్దరి మద్యలో టామ్ అండ్ జెర్రీ వార్ స్టార్ట్ అయ్యింది. అంతకు ముందు గుడ్డు విషయం , అలాగే ఫుడ్ విషయం, టాస్క్ లో ఆడే తీరు, ఇంట్లో వీరి మద్యలో పోరు పెట్టింది. ఇనయ ముఖ్యంగా శ్రీహాన్ ని వాడు అన్నాడని మనసులో పెట్టుకున్న శ్రీహాన్ ఇనయని బాగా టీజ్ చేయడం మొదలుపెట్టాడు.

అలాగే, ఇనయ కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా , మాట తూలినప్పుడల్లా శ్రీహాన్ కి ఇచ్చిపారేస్తూ వచ్చింది. ఇద్దరి మద్యలో గొడవలు తారాస్థాయికి వెళ్లకపోయినా టామ్ అండ్ జెర్రీ వార్ లాగా అయితే అందరికీ కనిపించాయి. కొన్ని సందర్భాల్లో వీళ్లు మాట్లాడే మాటలు, చేసే యాక్టింగ్ , డ్రామా అన్నీ కూడా హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ ని కూడా నవ్విస్తున్నాయి. 7వ వారం నామినేషన్స్ లో అయితే శ్రీహాన్ సోఫాలో చంకీలు పడ్డాయని, సండే ఎపిసోడ్ లో ఇనయ వేసుకున్న డ్రెస్ తాలుకా చంకీలు ఇరుక్కుపోయాయని వాటిని క్లీన్ చేస్తూ కెప్టెన్ కి కంప్లైట్ ఇచ్చాడు.

దీనిపైన నామినేషన్ చేసింది ఇనయ. అలాగే, శ్రీహాన్ కూడా ఇనయని ఇమిటేషన్ చేస్తూ లయర్స్ అని మమ్మల్ని అన్నావ్ అది నచ్చలేదని నామినేట్ చేశాడు. ఈ రెండు సిల్లీ పాయింట్సే అయినా కూడా ఇద్దరి మద్యలో ఉన్న వైరాన్ని మరోసారి చూపించాయి. నామినేషన్స్ లో వీళ్లిద్దరూ మాట్లాడుకున్న తీరు ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తోంది. నిజానికి శ్రీహాన్ వల్లే ఇనయ బాగా హైలెట్ అయ్యింది.

నామినేషన్స్ లో అందరూ ఇనయకి వ్యతిరేకం అవ్వడం వల్ల సోషల్ మీడియాలో సపోర్టర్స్ ఎక్కువయ్యారు. దీంతో ఇనయ 7 వారాల పాటు హౌస్ లో ఉంది. వీరిద్దరి మద్యలో ఇలాగే గనక మరికొన్ని వారాలు ఫైట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇద్దరూ టాప్ 5లోకి వెళ్తారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఇద్దరి మద్యలో ఏదో ఒక ఇష్యూలో గొడవ అవుతూనే ఉంది. మరి ఈ సిల్లీ ఫైట్ రానున్న వారాల్లో ఇది ఎక్కడి వరకూ దారితీస్తుంది అనేది చూడాలి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus