Disco Shanti: బావ మరణంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా ఇతర భాషలలో కూడా పలు స్పెషల్ సాంగ్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసినటువంటి వారిలో డిస్కో శాంతి ఒకరు ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించినటువంటి ఈమె నటుడు శ్రీహరిని వివాహం చేసుకున్నారు. ఇలా శ్రీహరి డిస్కో శాంతిల వివాహం 1996లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ విధంగా వీరి వివాహం అనంతరం ఈ దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించారు.

అయితే పిల్లల ఆలనా పాలన చూసుకోవడంలో నిమగ్నమైనటువంటి సినిమాలకు దూరమయ్యారు. ఇలా భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి వీరి కుటుంబంలో శ్రీహరి మరణంతో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. శ్రీహరి ఓ సినిమా షూటింగ్ ముంబై వెళ్లారు. అయితే ఈయన కాలయ వ్యాధితో బాధపడుతుండేవారు. ఇలా సినిమా షూటింగ్లో భాగంగా ఒక్కసారి కుప్పకూలిపోవడంతో తనని ముంబైలో ఓ ఆసుపత్రిలో చేర్పించారు.

ఈ విధంగా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నటువంటి శ్రీహరి అక్టోబర్ 9 2013 వ సంవత్సరంలో కన్ను మూసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డిస్కో శాంతి శ్రీహరి మరణం తర్వాత తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బావ మరణించిన తర్వాత నేను డిప్రెషన్ కి గురయ్యానని తెలిపారు. దాదాపు మూడు నెలల పాటు డిప్రెషన్ లోనే ఉండిపోయానని తెలిపారు.

ఈ విధంగా శ్రీహరి మరణ వార్త నుంచి బయటపడటం కోసమే నేను మద్యానికి కూడా బానిసగా మారిపోయానని ఈమె తెలిపారు. బావ చనిపోయిన తర్వాత నా సోదరులు దాదాపు మూడు నెలల పాటు నా వద్దే ఉన్నారు. అయితే పిల్లల చదువులు నిమిత్తం వారు వెళ్లిపోయారు. ఇక అప్పటినుంచి నా పిల్లల మద్దతు నాకు ఉందని తెలిపారు. అయితే శ్రీహరి మరణం తర్వాత తమ కుటుంబం ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా (Disco Shanti) డిస్కో శాంతి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus