Srija: నెగిటివ్ కామెంట్స్ గురించి శ్రీజ రియాక్షన్ ఏంటో తెలుసా?

మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ గురించి చర్చ జరుగుతోంది. తాజాగా శ్రీజ సోషల్ మీడియాలో కొత్త ప్రయాణం మొదలుపెడతానంటూ చేసిన పోస్ట్ వల్ల శ్రీజ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. గతేడాదిలో తనకిష్టమైన వ్యక్తి గురించి తెలుసుకున్నానంటూ శ్రీజ పోస్ట్ చేశారు. అయితే ఆ ఇష్టమైన వ్యక్తి ఎవరో కాదని నేనేనని శ్రీజ క్లారిటీ ఇచ్చారు.

నేను ఎవరితోనో రిలేషన్ షిప్ లో ఉన్నానని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని శ్రీజ చెప్పుకొచ్చారు. “ఐ యామ్ లవింగ్ ది రిలేషన్ షిప్ విత్ సెల్ఫ్” అంటూ తన ఫోటోతో శ్రీజ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను సెల్ఫ్ రిలేషన్ లో ఉన్నానని శ్రీజ స్పష్టత ఇవ్వడంతో ఇకనైనా ఆమె గురించి వైరల్ అవుతున్న వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి తాజాగా శ్రీజకు 35 కోట్ల రూపాయల ఖరీదైన ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చారని సమాచారం అందుతోంది. శ్రీజ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చిరంజీవి ఈ ఇంటిని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చినట్టు సమాచారం. చిరంజీవి ప్రస్తుతం ఒక్కో సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాల రెమ్యునరేషన్ తో చిరంజీవి చిన్నకూతురికి బహుమతిని ఇచ్చారని తెలుస్తోంది. చిరంజీవి 9 నెలల గ్యాప్ లో మూడు సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య ఈ నెలలో రిలీజ్ కానుండగా ఏప్రిల్ లో భోళా శంకర్ రిలీజ్ కానుంది. చిరంజీవి ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus