‘బ్రహ్మోత్సవం’ లాంటి డిజాస్టర్ ఇవ్వడంతో 4 ఏళ్ళ పాటు శ్రీకాంత్ అడ్డాల జాడ కనబడలేదు. ఎట్టకేలకు 2020 ఆరంభంలో వెంకటేష్- సురేష్ బాబులు అతనికి అవకాశం ఇచ్చారు. అది ‘అసురన్’ రీమేక్ అయిన ‘నారప్ప’. రాక రాక వచ్చిన అవకాశం కావడంతో 58 రోజుల్లో ఆ ప్రాజెక్టుని ఫినిష్ చేసి విడుదల చేయాలని శ్రీకాంత్ భావించాడు. అయితే చివర్లో కరోనా ఎంట్రీ ఇచ్చి షూటింగ్ ఆగిపోయేలా చేసింది. మొత్తానికి కిందా మీదా పడి ‘నారప్ప’ ని ఫినిష్ చేస్తే.. అది కాస్త ధియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేసుకుని నేరుగా ఓటిటిలో విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు ఇది అతనికి పెద్ద ఛాలెంజ్ గా మారింది. సినిమా బాగుంటే కచ్చితంగా అతనికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. లేదంటే మళ్ళీ సీన్ మొదటికి వస్తుంది. అంతేకాకుండా నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేసే అవకాశం లేకపోలేదు. శ్రీకాంత్ అడ్డాలతో పాటు మరో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ పరిస్థితి కూడా ఇంచు మించు ఇలానే ఉంది. ఇతనికి 5 ఏళ్ళ తర్వాత ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్లో అఖిల్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా హిట్ అయితే ఇతనికి మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.ఇదిలా ఉండగా..
ఇప్పుడు ఈ మూవీ కూడా ఓటిటి బాట పడుతుందని వినికిడి. ‘ఆహా’ లేదా ‘అమెజాన్ ప్రైమ్’ ‘నెట్ ఫ్లిక్స్’ వంటి ఓటిటిలలో ఈ మూవీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు టాక్ నడుస్తుంది.అయితే ఈ విషయాన్ని నిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఏమైనా అది నిజమైతే… శ్రీకాంత్ తో పాటు భాస్కర్ కు కూడా ఇది పెద్ద పరీక్షే అని చెప్పాలి. ఓటిటి ప్లాట్ ఫామ్ అంటే కచ్చితంగా ఎక్కువ మంది ప్రేక్షకులు మూవీని చూస్తారు. మంచి టాక్ వస్తే మరిన్ని ఆఫర్లు వస్తాయి లేదంటే మళ్ళీ ఏళ్ళ పాటు నిరీక్షణ తప్పదనే చెప్పాలి.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్