Srikanth Addala: ‘గీతా ఆర్ట్స్’ నో చెప్పడంతో దిల్ రాజుని ఆశ్రయించిన శ్రీకాంత్ అడ్డాల

శ్రీకాంత్ అడ్డాల.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఇతను తొలి సినిమాతోనే పెద్ద బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. క్లాస్ సినిమా అయినప్పటికీ మాస్ సెంటర్స్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది అంటే అది శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ వల్లనే అని చెప్పడంలో సందేహం లేదు. కథగా చెప్పుకోవడానికి ‘కొత్త బంగారు లోకం’ లో ఏమీ ఉండదు.

ఓ టీనేజ్ లవ్ స్టోరీకి సెన్సిబిల్ అంశాలు దిద్ది తీసిన సినిమా. శ్రీకాంత్ కి పెద్ద ఛాన్స్ లు రావడం వెనుక కారణం కూడా అదే. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో చాలా లూప్ హోల్స్ ఉన్నా పాస్ మార్కులు పడిపోయాయి. అది ఓ క్లాసిక్ అనిపించుకుంది. ‘ముకుంద’ ఆడకపోయినా ‘బ్రహ్మోత్సవం’ వంటి పెద్ద స్కేల్ మూవీ శ్రీకాంత్ కి చేసే అవకాశం దక్కింది. దాని రిజల్ట్ చాలా దారుణంగా వచ్చిన సంగతి తెలిసిందే.

అయినా శ్రీకాంత్ కి ‘నారప్ప’ ‘పెదకాపు 1’ వంటి క్రేజీ మూవీస్ ఛాన్స్ లభించింది. దాన్ని అతను సద్వినియోగపరుచుకోలేదు. ‘పెదకాపు 1’ సినిమా బ్రహ్మోత్సవం ని మించిన డిజాస్టర్ అనిపించుకుంది. దీంతో శ్రీకాంత్ కి ఇప్పుడు ఛాన్స్ లు లేకుండా చేశాయి. ‘అన్నాయ్’ అనే కథని గీతా ఆర్ట్స్ సంస్థ ఓకే చేసినా ఇప్పుడు వెనక్కి తగ్గింది.

‘పెదకాపు 2’ ఎలాగు కష్టం. సో ఇప్పుడు (Srikanth Addala) శ్రీకాంత్ అడ్డాల తరచుగా ఎక్కువ దిల్ రాజుని కలుస్తూ వస్తున్నాడట. దిల్ రాజుకి కూడా శ్రీకాంత్ పై పాజిటివ్ కార్నర్ ఉంది. తనకి రెండు హిట్లు ఇచ్చాడు కాబట్టి.. ఇప్పుడు మిడ్ రేంజ్ సినిమా చేసుకోమని దిల్ రాజు చెప్పొచ్చు. కానీ హీరో ఎవరు దొరుకుతారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus