Srikanth: ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ డిలే.. శ్రీకాంత్ ఊహించని కామెంట్లు!

రాంచరణ్ (Ram Charan) – శంకర్ (Shankar) కాంబినేషన్లో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కాబోతుంది. 2021 లో మొదలైన ఈ సినిమా.. కంప్లీట్ అవ్వడానికి 3 ఏళ్ళు పైనే టైం పట్టింది. పైగా అప్డేట్స్ వంటివి కూడా సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల.. చరణ్ ఫ్యాన్స్ ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ డిలే అవ్వడం పై నటుడు శ్రీకాంత్ (Srikanth) క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Srikanth

శ్రీకాంత్ మాట్లాడుతూ.. “ఒక్కో సినిమా అంతే..! లేట్ అవుతూ ఉంటుంది. వాతావరణం వల్ల ఏర్పడ్డ సమస్యల వల్ల కావచ్చు, ఆర్టిస్ట్..ల కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడం వంటి సమస్యల వల్ల షూటింగ్ డిలే అవుతూ ఉంటుంది. ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి వచ్చేసరికి… ‘ఇది శంకర్ గారి సినిమా కావడం, మధ్యలో ఆయన కమల్ హాసన్ (Kamal Haasan) గారి ‘ఇండియన్ 2’ (Indian 2) చేయాల్సి రావడంతో కొన్ని నెలల పాటు షూటింగ్ జరగలేదు.

తర్వాత ఆర్టిస్టులు కాంబినేషన్ సెట్ చేయడానికి కూడా నెలలు నెలలు టైం పట్టేసేది. అంతెందుకు నా వల్లే సినిమా 3 నెలలు డిలే అయ్యింది. నేను గడ్డంతో దేవర చేశాను. ‘గేమ్ ఛేంజర్’ కి గడ్డం లేకుండా చేయాల్సి ఉంది. అందువల్ల నేను కూడా అందుబాటులో లేకుండా పోయాను. అలాగే ఎస్.జె.సూర్య (SJ Suryah) కూడా బిజీ ఆర్టిస్ట్. అనుకున్న డేట్స్ కి ఆయన కూడా అందుబాటులో ఉండే వాడు కాదు.

అలా ఈ సినిమాకి ఎక్కువ టైం పట్టింది. రాజమండ్రిలో షూటింగ్ చేశాం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా అక్కడే జరిగింది. కొన్ని సీన్స్ ఎక్కువగా తీసారేమో కానీ.. షూటింగ్ రోజులు పెరిగింది ఎక్కువగా ఏమీ లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

‘ఎందుకు రిపీట్ చేశారు?’ అని చిరంజీవి గారిని ప్రశ్నించాను : హర్షవర్ధన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus