Harshavardhan: ‘ఎందుకు రిపీట్ చేశారు?’ అని చిరంజీవి గారిని ప్రశ్నించాను : హర్షవర్ధన్!

సీనియర్ నటుడు, కమెడియన్, డైరెక్టర్ అయినటువంటి హర్షవర్ధన్ (Harsha Vardhan) అందరికీ సుపరిచితమే. తాజాగా ఇతను చిరంజీవి (Chiranjeevi) గారి గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో భాగంగా హర్షవర్ధన్ చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. హర్షవర్ధన్ (Harshavardhan) మాట్లాడుతూ.. “చిరంజీవి గారితో కలిసి ‘విశ్వంభర’ (Vishwambhara) షూటింగ్లో పాల్గొంటున్నాను. ‘స్టాలిన్’లో (Stalin) కూడా చిరంజీవి గారితో కలిసి నటించాను. ‘స్టాలిన్’ సినిమా టైంలో చిరంజీవి గారితో నాకొక మంచి జ్ఞాపకం ఉంది.

Harshavardhan

అది చెప్పే ముందు అందరికీ ఒక విషయం చెప్పాలి. సాధారణంగా ఏ హీరో కూడా ఒక సినిమాలో వాడిన కాస్ట్యూమ్ ఇంకో సినిమాలో వాడడు. కానీ ‘అన్నయ్యా.. మీరు ఒక సినిమాలో వాడిన కాస్ట్యూమ్ ఇంకో సినిమాలో వాడారు’ అని నేను చెప్పాను. అందుకు చిరంజీవి గారు గుర్తు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. మనకు అంటే ఆయన సినిమాల్లో చేసే ప్రతీదీ గుర్తుంటుంది. ఆయనకు అలా కాదు కదా. అందుకే ఆయనతో ఇలా అన్నాను.

మీరు ‘చిరంజీవి గారే కానీ చిరంజీవి గారి అభిమాని కాదు కదా ఇవన్నీ గుర్తుండడానికి’ అని..! అందుకున్న అన్నయ్య చాలా ఆనందంగా ఫీలయ్యారు. ఆ తర్వాత డైవర్ట్ అవ్వకుండా విషయం చెప్పాను. ‘అన్నయ్యా.. మీరు ‘జ్వాల’ సినిమాలో వాడిన కాస్ట్యూమ్ ఇంకో సినిమాలో కూడా వాడారు. అదే ‘చిన్నారి చేతన’ అనే పాన్ ఇండియా సినిమా ఇంట్రోలో అని..! సౌత్ లో వచ్చిన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అది. చిన్నారి చేతన అనేది 3D ఫిలిం.

‘3D’ గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి చిరంజీవి గారితో చెప్పించారు. అప్పుడు ‘జ్వాల’ సినిమాలో వాడిన డ్రెస్ వేసుకుని చిరంజీవి గారు ఆ వీడియోలో నటించి ఉంటారు. అదే విషయం నేను చిరంజీవి గారికి గుర్తు చేస్తే ఆయన చాలా సంతోషించారు” అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

రజినీకాంత్‌కు కోపం తెప్పించిన ప్రశ్న.. అందరిముందే కౌంటర్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus