Srikanth Remuneration: రెమ్యునరేషన్ పెంచేసిన శ్రీకాంత్.. కానీ?

ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అఖండ మూవీ హవా కొనసాగుతోంది. ఫ్లాప్ లో ఉన్న బాలయ్యకు, బోయపాటి శ్రీనుకు అఖండ సినిమాతో భారీ విజయం దక్కింది. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని శ్రీకాంత్ ఈ సినిమాతో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. విలన్ వరదరాజులు పాత్రకు శ్రీకాంత్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. అయితే శ్రీకాంత్ మెయిన్ విలన్ అయ్యి ఉంటే ఈ సినిమా సక్సెస్ శ్రీకాంత్ కు మరింత ప్లస్ అయ్యి ఉండేది.

అఖండ కోసం శ్రీకాంత్ కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం పారితోషికం తీసుకున్నారని సమాచారం. సినిమాలో కొన్ని సన్నివేశాల్లోనే నటించినా శ్రీకాంత్ ఊహించని స్థాయిలో పారితోషికం తీసుకోవడం గమనార్హం. అయితే ఈ సక్సెస్ శ్రీకాంత్ కెరీర్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాల్సి ఉంది. బోయపాటి శ్రీను తన సినిమాలలో మంచి పాత్రలు ఇస్తూ శ్రీకాంత్ కెరీర్ కు హెల్ప్ అవుతున్నారు. జగపతిబాబులా శ్రీకాంత్ విలన్ గా బిజీ అవుతారని ఫ్యాన్స్ భావించగా ఫ్యాన్స్ కు మాత్రం నిరాశ ఎదురవుతోంది.

అఖండ తర్వాత శ్రీకాంత్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ హీరోగా నటించిన సినిమాలు కూడా సక్సెస్ సాధించడం లేదు. శ్రీకాంత్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని అఖండ సినిమాకు నిర్మాతలు భారీగా పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే కొంతమంది మాత్రం శ్రీకాంత్ కు అఖండ మూవీ రోల్ విషయంలో బోయపాటి శ్రీను అన్యాయం చేశారని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus