Govindudu Andarivadele: ఆ కారణంతోనే వెంకటేష్ చరణ్ సినిమాలో నటించలేదా?

ప్రస్తుత కాలంలో మల్టీ స్టార్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి. ఇక యంగ్ హీరోల సినిమాలలో కూడా సీనియర్ హీరోలు బాగమవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా హీరో వెంకటేష్ శ్రీకాంత్ వంటి హీరోలు యంగ్ హీరోలకు బాబాయ్ అన్నయ్య పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. తాజాగా శ్రీకాంత్ స్కంద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈయన రామ్ చరణ్ అల్లు అర్జున్ సినిమాలలో కూడా ఆ హీరోలకు బాబాయ్ పాత్రలలో నటించి మెప్పించారు.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గోవిందుడు అందరివాడే ఈ సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్రలో నటించడానికి శ్రీకాంత్ ఫస్ట్ ఆప్షన్ కాదని తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ పాత్ర తర్వాత ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి పాత్ర శ్రీకాంత్ పాత్ర అని చెప్పాలి. అయితే ఈ పాత్రలో నటించడం కోసం కృష్ణ వంశీ ముందుగా హీరో వెంకటేష్ ని సంప్రదించారట.

కృష్ణవంశీ కథ చెప్పిన తర్వాత వెంకటేష్ ఈ పాత్రకు తాను పెద్దగా సూట్ అవ్వనని చెప్పి ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ఈ పాత్రలో శ్రీకాంత్ నటించారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా చరణ్ శ్రీకాంత్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకుంది

ఒకవేళ ఈ సినిమాలో చరణ్ పాత్రలో వెంకటేష్ కనుక నటించి ఉంటే (Govindudu Andarivadele) ఈ సినిమా కూడా మరింత మంచి సక్సెస్ అందుకొని ఉండేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే భవిష్యత్తులో ఎప్పుడైనా మరోసారి వెంకటేష్ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుంటుందని ఈ హీరోల అభిమానులు కూడా ఆశపడుతున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus