‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ వంటి డిజాస్టర్లను మూటకట్టుకుని ఎన్నో విమర్శలు ఎదుర్కున్నాడు మహేష్. ఆ రెండు చిత్రాలు భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. అలాంటి టైంలో తన తదుపరి సినిమా హిట్ అయినప్పటికీ.. పెద్ద మొత్తంలో కలెక్ట్ చేస్తుందా వంటి ఎన్నో అనుమానాలు నెలకొన్న రోజులవి. ఇక కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న దర్శకుడు కొరటాల శివ.. మహేష్ బాబు వంటి స్టార్ హీరో ఇమేజ్ ను మ్యానేజ్ చెయ్యగలడా అని కూడా కామెంట్స్ వినిపించిన రోజులవి. మరో పక్క రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి ది బిగినింగ్’ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అలాంటి టైంలో అసలు మహేష్ బాబు సినిమాని పట్టించుకుంటారా? ఇలాంటి ఎన్నో అనుమానాల మధ్యలో 2015 ఆగష్ట్ 7న ‘శ్రీమంతుడు’ చిత్రం విడుదలైంది.
మొదటి షో నుండే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని.. ఈవెనింగ్ షోస్ నుండీ మరింత దూకుడు పెంచింది ‘శ్రీమంతుడు’.మంచి మెసేజ్ తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా సమానంగా దట్టించి.. వడ్డించాడు దర్శకుడు కొరటాల శివ. ‘బాహుబలి1’ పోటీ ఉన్నప్పటికీ ‘శ్రీమంతుడు’ చిత్రం 2 వారాల్లోనే.. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కేటగిరిలో ఉన్న పవన్ కళ్యాణ్.. ‘అత్తారింటికి దారేది’ కలెక్షన్స్ కూడా అధిగమించింది.
ఇక ఈ చిత్రం ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్ధాం రండి :
నైజాం
22.34 cr
సీడెడ్
9.40 cr
వైజాగ్
5.63 cr
ఈస్ట్
6.12 cr
వెస్ట్
4.37cr
కృష్ణా
4.37 cr
గుంటూరు
5.75 cr
నెల్లూరు
2.19 cr
ఏపీ + తెలంగాణ
60.17 cr
కర్ణాటక
7.07 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.05 cr
తమిళనాడు (తెలుగు వెర్షన్)
1.05 cr
రెస్ట్ ఆఫ్ వరల్డ్
2.29 cr
తమిళనాడు (తమిళ్ వెర్షన్)
0.68 cr
కేరళ (తమిళ్ వెర్షన్)
0.39 cr
యూ.ఎస్.ఏ
12.50 cr
వరల్డ్ వైడ్ టోటల్
85.20 cr (Share)
‘శ్రీమంతుడు’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 57 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఫుల్ రన్ ముగిసే సరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 85.20 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. అంటే 28 కోట్ల వరకూ లాభాల్ని మిగిల్చిందని చెప్పొచ్చు. ఇక నెట్ పరంగా చూసుకుంటే ఈ చిత్రం 108.26 కోట్లను.. అలాగే గ్రాస్ పరంగా చూసుకుంటే 144.55 కోట్లను కొల్లగొట్టింది.