‘కె.జి.ఎఫ్’ హీరోయిన్ ప్లేస్లో సాయి పల్లవి వచ్చిందా?

శ్రీనిధి శెట్టి  (Srinidhi Shetty) అందరికీ సుపరిచితమే. కె.జి.ఎఫ్ చాప్టర్ 1(KGF) , కె.జి.ఎఫ్ చాప్టర్ 2 (KGF 2)  సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అవి పాన్ ఇండియా రేంజ్లో సక్సెస్ అయినా ఈమెకు ఎందుకో తెలుగు హీరోల సరసన నటించే ఛాన్సులు రాలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. కె.జి.ఎఫ్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈమె భారీగా పారితోషికం డిమాండ్ చేయడం వల్ల… మేకర్స్ భయపడి ఈమెకు ఛాన్సులు ఇవ్వలేదు అనే టాక్ ఉంది.

Srinidhi Shetty 

అయితే మొత్తానికి నాని (Nani) సరసన ‘హిట్ 3’ (HIT 3) రూపంలో ఈమెకు మంచి ఛాన్స్ వచ్చిందని చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఏకంగా ఈమె బాలీవుడ్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టు చెప్పి షాకిచ్చింది. శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) మాట్లాడుతూ.. “నితీష్ తివారి (Nitesh Tiwari)  ‘రామాయణ’ సినిమా కోసం నేను కూడా ఆడిషన్ ఇచ్చాను.రణబీర్ కపూర్ (Ranbir Kapoor) సరసన సీత పాత్ర కోసమే నేను ఆడిషన్ ఇవ్వడం జరిగింది.

అయితే ఎందుకో నేను సెలెక్ట్ అవ్వలేదు. సాయి పల్లవి ఆ పాత్రకి ఎంపికయ్యింది. వాస్తవానికి అందుకు కారణం కూడా ఉంది. నేను సీత లుక్ లో, కాస్ట్యూమ్స్ లో కరెక్ట్ గా సెట్ అయ్యాను. దర్శకుడు కూడా సంతృప్తి చెందారు. కానీ ఆ సినిమాలో రావణాసురుడు పాత్ర యష్ చేస్తున్నారు.

మరోపక్క నేను ఆల్రెడీ కె.జి.ఎఫ్ లో యష్ కు (Yash)  జోడీగా చేశాను. అప్పటి మా ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఈ సినిమాకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని మేకర్స్ భయపడి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ సాయి పల్లవి  (Sai Pallavi)  నటన అంటే నాకు కూడా ఇష్టం. ఆ రకంగా నేను పెద్ద బాధపడలేదు” అంటూ చెప్పుకొచ్చింది.

‘సారంగపాణి జాతకం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus