దాదాపు 13 ఏళ్ళ తర్వాత ‘ అవతార్ 2’ వస్తుంది. జేమ్స్ కేమరూన్ రూపొందించిన ఈ హాలీవుడ్ చిత్రాన్ని వీక్షించాలని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. అవతార్: ది వే ఆఫ్ వాటర్ సీక్వెల్ ను జేమ్స్ కేమరూన్ ఏ రేంజ్లో చిత్రీకరించాడు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ‘అవతార్’ కలెక్షన్లను ఈ మూవీ ఒక్క రోజులోనే బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. తెలుగు వెర్షన్ కూడా డిసెంబర్ 16నే విడుదల కాబోతుంది. అయితే ఇక్కడి ప్రేక్షకులు కూడా ఒరిజినల్ వెర్షన్ ను చూసేందుకు ఇష్టపడుతున్నారు.
3D బుకింగ్స్ నెవర్ బిఫోర్ అనే రేంజ్లో ఉన్నాయి. ‘అవతార్ 2’ కి పోటీగా ఏ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ రిలీజ్ అయినా ఎక్కువ థియేటర్లలో ‘అవతార్ 2’ ప్రదర్శింపబడుతోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా.. ‘అవతార్ 2’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటి అంటే ‘అవతార్ 2’ కోసం టాలీవుడ్ దర్శకుడు.. శ్రీనివాస్ అవసరాల కూడా పని చేశాడట.
ఎలా అంటే ‘అవతార్’ తెలుగు వెర్షన్ కు ఆయన డైలాగ్స్ రాశారట. గతంలో హాలీవుడ్ సినిమాల తెలుగు వెర్షన్ డైలాగులు చాలా కామెడీగా అనిపించేవి. ఎందుకంటే తెలుగు డబ్బింగ్ కోసం నోటెడ్ రైటర్స్ ను హాలీవుడ్ మేకర్స్ సంప్రదించేవారు కాదు. అయితే ఇప్పుడు తెలుగు మార్కెట్ కూడా కీలకమైంది. అందుకోసం ఇప్పుడు హాలీవుడ్ అనే కాకుండా తమిళ డబ్బింగ్ సినిమాలకు, కన్నడ డబ్బింగ్ సినిమాలకు కూడా నోటెడ్ రైటర్స్ పనిచేస్తున్నారు.
‘పొన్నియన్ సెల్వన్ పీఎస్-1’ కి తనికెళ్ళ భరణి వంటి రైటర్ పనిచేసిన సంగతి తెలిసిందే. ‘అవతార్ 2’ కి అవసరాల వంటి పేరున్న దర్శకుడిని ఎంపిక చేసుకోవడం విశేషమనే చెప్పాలి. గతంలో అవసరాల ‘బ్రహ్మాస్త్ర’ తెలుగు వెర్షన్ కు కూడా డైలాగులు రాశాడు. ఇక అవసరాల శ్రీనివాస్.. ‘ఊహలు గుసగుసలాడే’ ‘జ్యో అచ్యుతానంద’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.ఇతని దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!