తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వి.వి.వినాయక్, శ్రీనువైట్ల వరుసగా సూపర్ హిట్స్ కొట్టి స్టార్ డైరెక్టర్స్ గా క్రేజ్ సంపాదించారు. వీరి సినిమాలో హీరోయిజం, కామెడీ, యాక్షన్ ఒక రేంజులో ఉంటూ ఈ సక్సెస్ ఫార్ములాతో చాలా హిట్లే కొట్టారు. కానీ రొటీన్ కి భిన్నంగా లేకుండా వారి స్టైల్ లోనే సినిమాలు తీయడం వలన కొంత కాలం నుండి సరైన సక్సెస్ లేకుండా వీరి కెరియర్ అయోమయంలో పడిందని కొందరి అభిప్రాయం. ఒకప్పుడు ప్రొడ్యూసర్లు లైన్లో ఉండగా ఇప్పుడు వీరే వెళ్లి ప్రొడ్యూసర్స్ ని సినిమా అవకాశం అడిగే స్థాయిలో ఉన్నారని తెలుస్తుంది.
అయితే వి.వి.వినాయక్ చిరంజీవి 150 వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ డైరెక్షన్ చేయడంతో ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వస్తాడు అని అభిమానులు అనుకుంటే ఆ తరువాత ‘ఇంటలిజెంట్’ సినిమా తీసి అట్టర్ ప్లాప్ ని నెత్తి మీద వేసుకున్నాడు. ఇక ఈ ప్లాప్ నుండి తేరుకొని కొంచం గ్యాప్ తరువాత హీరో బాలకృష్ణతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాతో మళ్ళీ తన సత్తా చూపిస్తాడని అనుకుంటున్నారు. ఇక డైరెక్టర్ శ్రీనువైట్ల ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ సినిమాతో హ్యాట్రిక్ ఫెల్యూర్ సాధించాడు. వి.వి.వినాయక్ తో పోలిస్తే శ్రీనువైట్ల పరిస్థితి మరి దారుణం అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికైనా వీరు వారి కథల విషయంలో ట్రెండ్ కి తగ్గట్టు కొంచెం డిఫెరెంట్ స్టోరీస్ తో వస్తే ఈ మాస్ డైరెక్టర్స్ కి మళ్ళీ వారి పాత రోజులు తిరిగి వస్తాయని సినీ విశ్లేషకుల అభిప్రాయం. మరి ఈ మాస్ డైరెక్టర్స్ నెక్స్ట్ సినిమా ఎలా తీస్తారు, రూట్ మారుస్తారా లేదా అదే రూట్ లో వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తారనేది చూడాలి.