Sriram Adittya: ఈ డైరక్టర్‌ పెళ్లి అచ్చంగా సినిమాలాగే ఉంటుంది.. తెలుసా?

  • May 22, 2023 / 06:05 PM IST

సినిమాల్లో పని చేసేవాళ్లు ముఖ్యంగా సినిమా దర్శకుల పెళ్లి చాలా సినిమాటిక్‌గా ఉంటుంది అని అంటుంటారు. గతంలో దీని గురించి కొంతమంది చెప్పినా.. ఇటీవల కాలంలో ఎక్కువగా తెలుస్తున్నాయి. చాలామంది యువ దర్శకులవి ప్రేమ వివాహాలే కావడం గమనార్హం. ఇలాంటి విషయాలన్నీ ఓ ప్రముఖ టీవీలో షో ద్వారా తెలుస్తున్నాయి. తాజాగా యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య ప్రేమ, పెళ్లి గురించి వివరాలు తెలిశాయి. ‘భలే మంచి రోజు’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచమయ్యారు శ్రీరామ్ ఆదిత్య.

శ్రీరామ్ (Sriram Adittya) మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఫేస్ బుక్, గూగుల్‌లో పని చేశారు కూడా. ఆ సమయంలో శ్రీరామ్‌ చాలా కథలు రాసుకున్నారట. ఓవైపు ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు. సాఫ్ట్ వేర్ జాబ్ నుండి సినీ రంగానికి వచ్చాక.. తాను ప్రేమించిన అమ్మాయితో ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకున్నారట. అందరికీ ఒక పెళ్లి రోజు ఉంటే శ్రీరామ్‌ ఆదిత్య – ప్రియాంకకు రెండు పెళ్లి రోజులు ఉన్నాయట. ఒకటి ఆర్య సమాజ్‌లో జరిగిందని చెప్పారు.

రేపు పెళ్లి ఉందని అనగా.. ముందు రోజు పవన్‌ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బెనిఫిట్ షోకి వెళ్లామని చెప్పారు. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పిన శ్రీరామ్‌.. పెళ్లికి ముందు శ్రీరామ్ ఏ అమ్మాయితో మాట్లాడాలన్నా తాను హెల్ప్ చేసేదాన్ని ప్రియాంక చెప్పారు. అంత సపోర్ట్‌గా ఉండేది కాబట్టే తాను పెళ్లిచేసుకున్నానని శ్రీరామ్ స్పష్టం అన్నారు. ప్రియాంకను తన తండ్రి వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేశారట.

పెళ్లి కోసం బంధువులకు, స్నేహితులకు కార్డ్స్ కూడా పంచారట. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా ప్రియాంకను శ్రీరామ్ తీసుకెళ్లి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారట. అప్పట్లో ఈ విషయం వార్తల్లో కూడా వచ్చింది. ఇక శ్రీరామ్ సంగతి చూస్తే… ‘శమంతకమణి’, ‘దేవదాస్’, ‘హీరో’ తదితర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus