Bigg Boss 5 Telugu: ‘నీ ఫుడ్ నువ్వే వండుకో’ అని ఎందుకన్నాడు..?

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ శ్రీరామ్ తనదైన స్టైల్లో కెప్టెన్సీ చేస్తున్నాడు. హమీదాని రేషన్ మేనేజర్ గా చేసినప్పటి నుంచీ హౌస్ లో కొంతమందిలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. హమీదా రేషన్ మేనేజర్ గా అస్సలు సెట్ కాలేదని హౌస్ మేట్స్ లో కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిచెన్ లో కూరగాయలు తరిగేందుకు సన్నీకి ఒకరి హెల్ప్ కావాల్సి ఉందని శ్రీరామ్ జెస్సీని అడిగాడు. రాత్రిపూట్ చపాతీలు చేసేటపుడు వెజిటుబుల్స్ కట్ చేయమని అడిగాడు. దీనికి సరే అన్న జెస్సీ, ఆ తర్వాత చపాతీలు రోల్ చేయమని చెప్తే నేను కిచెన్ లో డిషెష్ వాష్ చేస్తున్నాను కదా..

ఇది నాకు రాదు అంటూ చెప్పాడు. నీకు రాకపోతే నేను నేర్పిస్తా అంటూ శ్రీరామ్ జెస్సీతో వాదన పెట్టుకున్నాడు. జెస్సీ శ్రీరామ్ పై కౌంటర్ ఎటాక్ చేశాడు. దీనికి అలా చేస్తే నేను ఎవరి ఫుడ్ వాళ్లని వండుకోమని రూల్ పెడతా అన్నాడు నీకు ఓకేనా అన్నాడు. ఇక్కడే జెస్సీ ట్రిగ్గర్ అయ్యాడు. మీ ఇష్టం అన్నాడు. అయితే, జెస్సీ ఫుడ్ జెస్సీ వండుకుంటాడు అంట వదిలేయండి అన్నాడు. ఓకే ఫైన్ అంటూ వెళ్లిన జెస్సీ అక్కడున్న సిరికి , కాజల్ కి ఈవిషయాన్ని చెప్పాడు. ఇక్కడ సిరి జెస్సీకి సపోర్టింగ్ గా నిలిచింది. షణ్ముక్ జెస్సీ వకాల్తా తీస్కుని మరీ వచ్చాడు.

ఇక్కడ ముగ్గురు మాట్లాడుతున్నా కూడా శ్రీరామ్ ముగ్గురికీ సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు. నిజానికి నీ ఫుడ్ నువ్వే వండుకో అని శ్రీరామ్ ఎందుకన్నాడు అనేది చూస్తే, మార్నింగ్ సన్నీ కూరలు తరుగుతున్నప్పుడు ఎవరైనా హెల్పింగ్ ఉంటే బాగుంటుందని జెస్సీని అడిగాడు శ్రీరామ్. అక్కడికి వచ్చిన జెస్సీ నేను ఉంటాను నో ప్రాబ్లమ్ అని అన్నాడు. అందుకే చపాతీలు చేస్తున్నప్పుడు పిండిని ఉండలుగా రౌండ్స్ చేసేందుకు పిలిచాడు. నాకు రాదు అని క్లియర్ గా చెప్పాడు జెస్సీ. నేను నేర్పిస్తా ఇందులో ఏముంది అంటూ మాట్లాడినా కూడా శ్రీరామ్ మాటలు వినలేదు.

అందుకే , శ్రీరామ్ కి ఒళ్లుమండి ఇలా చేస్తే ఎవరి ఫుడ్ వాల్లే ఒండుకోమని రూల్ పాస్ చేస్తా అంటూ చెప్పాడు. ఇక ఈ ఆర్గ్యూమెంట్ లోకి దూరిన షణ్ముక్ కి కూడా సాలిడ్ పంచ్ లు వేశాడు శ్రీరామ్. మద్యలో నువ్వు రావద్దు అని, అసలు మేటర్ నీకు తెలీదని చెప్పాడు. అయినా కూడా ఎవరి ఫుడ్ వాళ్లు వండుకోమని స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది మాకు నచ్చలేదు అంటూ సిరి ఇంకా షణ్ముక్ ఇద్దరూ వాదించారు. జెస్సీకి శ్రీరామ్ కి జరిగిన వాదనలో శ్రీరామ్ జెన్యూన్ గానే మాట్లాడాడు. అయితే, ఎవరి ఫుడ్ వాళ్లు ఒండుకోమని చెప్పిన స్టేట్మెంట్ మాత్రం కరెక్ట్ కాదని సిరి వాదించింది. అదీ విషయం.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus