Srirastu Subhamastu Collections: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. అల్లు అరవింద్ గారు తన ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎటువంటి అంచనాలు లేకుండా 2016వ సంవత్సరం ఆగష్ట్ 5వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. శిరీష్ నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి.అతన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గర చేసిన మూవీ ఇది. తమన్ సంగీతం కూడా ప్లస్ పాయింట్స్ లో ఒకటని చెప్పాలి. నేటితో ఈ చిత్రం విడుదలై 5 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

మరి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 2.65 cr
సీడెడ్ 1.35 cr
ఉత్తరాంధ్ర 1.65 cr
ఈస్ట్ 0.78 cr
వెస్ట్ 0.70 cr
గుంటూరు 0.83 cr
కృష్ణా 0.80 cr
నెల్లూరు 0.31 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 9.07 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 0.98 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)  10.05 cr

 

‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రానికి రూ.8.35 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.10.05 కోట్ల షేర్ ను రాబట్టి.. హిట్ గా నిలిచింది.ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లకు రూ.1.7 కోట్ల లాభాలు దక్కాయి.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus