దెయ్యం టాస్క్ లో హౌస్ మేట్స్ లొల్లి..! శ్రీసత్యపై రేవంత్ ఫైర్..! అసలు జరిగింది ఇదే..

బిగ్ బాస్ హౌస్ లో దెయ్యం దెబ్బకి హౌస్ మేట్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఈ దెయ్యం టాస్క్ లో శ్రీసత్య కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లడానికే భయపడిపోయింది. దీంతో శ్రీసత్య వల్ల లక్షరూపాలయ ప్రైజ్ మనీని కోల్పోవాల్సి వచ్చింది. చాలాసార్లు బిగ్ బాస్ పిలిచినా కూడా శ్రీసత్య కన్ఫెషన్ రూమ్ లోకి అడుగుపెట్టలేదు. దీంతో రేవంత్ శ్రీసత్యపై అసహనాన్ని ప్రదర్శించాడు. అందరూ వెళ్లినపుడు నీకు ఏమైందంటూ ప్రశ్నించాడు. అంతేకాదు, బిగ్ బాస్ అన్నిసార్లు పిలుస్తున్నా కూడా నువ్వు లెక్కచేయలేదని కాసేపు ఫ్రస్టేట్ అయ్యాడు. దీంతో శ్రీసత్య ఇది ఎంటర్ టైన్మెంట్ టాస్క్ అని అలాగే చూడమని కౌంటర్ ఎటాక్ చేసింది.

కాసేపు ఆలోచించుకున్న రేవంత్ శ్రీసత్య దగ్గరకి వచ్చి సారీ చెప్పాడు. ఇక ఆ తర్వాత ఛాలెంజస్ మొదలయ్యాయి. మొదటి ఛాలెంజ్ లో శ్రీసత్య, ఇనయా, ఇంకా రేవంత్ ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. బాంబ్ బ్లాస్ట్ టాస్క్ లో వైర్స్ ని గుర్తుపెట్టుకుని కట్ చేయాల్సి ఉంటుంది. ఈటాస్క్ లో మిగతా హౌస్ మేట్స్ ఇనయా గెలుస్తుందని గెస్ చేశారు. కానీ, ఈ టాస్క్ లో శ్రీసత్య గెలిచి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక్కడ కూడా తనపైన నమ్మకం లేదా అంటూ మాట్లాడింది. అయితే, శ్రీహాన్ కూడా తనని నమ్మలేదని కాసేపు ఏడిపించింది.

ఆ తర్వాత ఛాలెంజ్ లో హౌస్ మేట్స్ కి టవర్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టవర్ టాస్క్ లో అందరూ బాగానే ఆడి కొంత క్యాష్ ని రికవరీ చేస్కున్నారు. ఆ తర్వాత జంతువుల సౌండ్ విని ఆ సౌండ్ ని క్యాచ్ చేసి దాన్ని పట్టుకున్నారు హౌస్ మేట్స్. ఇక్కడే ఫస్ట్ ఛాలెంజ్ లో శ్రీసత్య ఇంకా శ్రీహాన్ ఇద్దరూ పార్టిసిపేట్ చేశారు. ఇక్కడే శ్రీహాన్ గెలుస్తాడని ఏకాభిప్రాయంతో హౌస్ మేట్స్ చెప్పారు. ఇక్కడే రేవంత్ శ్రీసత్య పేరు చెప్పాడు. మిగతా వాళ్లు అందరూ ఏకాభిప్రాయంతో శ్రీహాన్ ని ఎంచుకున్నారు. బిబి6 ఫ్రేమ్ లో బల్బ్స్ పెట్టారు.

ఈ బల్బ్స్ ని పర్ఫెక్ట్ గా పెట్టిన శ్రీహాన్ విజేతగా నిలిచాడు. క్యాష్ ని రివకరీ చేశాడు. ఆ తర్వాత అసలు సిసలైన దెయ్యం టాస్క్ మళ్లీ మొదలైంది. ఫస్ట్ ఇనయా కన్ఫెషన్ రూమ్ కి వెళ్లింది. బయట హౌస్ మేట్స్ అందరికీ బిల్డప్ ఇచ్చి, చిన్నపిల్లలు మీరంతా అంటూ రెచ్చిపోయి మరీ రూమ్ లోకి వెళ్లింది. ఇక ఘోస్ట్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత చుక్కలు కనిపించాయి. ఫస్ట్ బాగానే మానేజ్ చేసింది కానీ, కొన్ని చోట్ల మాత్రం భయపడింది. ఇక షూని తీస్కుని ధైర్యంగానే వచ్చింది. ఆ తర్వాత రేవంత్ చాలా డిఫరెంట్. అస్సలు ఎక్కడా బెదర్లేదు, బెంబేలెత్తలేదు.

దెయ్యాన్ని కాలు పట్టుకుని గిల్లాడు. అలాగే, సూర్య కప్ ని తీస్కుని వచ్చాడు. దెయ్యం పాలు కావాలంటే తాగిపిస్తా రా అంటూ సైటైర్ కూడా వేశాడు. దెయ్యం టాస్క్ లో ఇనయా – రేవంత్ ఎపిసోడ్ అనేది ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. అంతేకాదు, మొత్తానికి ఈ దెయ్యం టాస్క్ లో మరోసారి శ్రీసత్య ని పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్బాస్. కీర్తి కూడా వచ్చింది. అలాగే రోహిత్ వచ్చినపుడు కూడా ఇంటి సభ్యులు అందరూ వచ్చారు. ఈ టాస్క్ పూర్తి అయ్యింది. అందరూ వచ్చినందుకు ప్రైజ్ మనీ ఫుల్ చేశాడు బిగ్ బాస్. మొత్తానికి ఈవారం దెయ్యం టాస్క్ అనేది ఆడియన్స్ కి మంచి కి్క్ ఇచ్చిందనే చెప్పాలి. అదీ మేటర్.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus