Sruthi Haasan: శృతి హాసన్ మదిలో అలాంటి కోరికలా.. ఆ పని చేయాలని ఉందంటూ?

ఈ ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో శృతి హాసన్ బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఒక్కరోజు గ్యాప్ లో శృతి హాసన్ రెండు విజయాలను ఖాతాలో వేసుకున్నారు. సలార్ సినిమాలో ఆద్య అనే టీచర్ రోల్ లో శృతి హాసన్ నటిస్తుండగా ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. సలార్ మూవీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా శృతి హాసన్ ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్లతో ముచ్చటించడం గమనార్హం.

తనకు టాటూలంటే పిచ్చి అని 19 సంవత్సరాల వయస్సులో తొలిసారి టాటూ వేయించుకున్నానని ఆమె తెలిపారు. నేను నటిని కాకపోయి ఉంటే శరీరమంతా టాటూలు వేయించుకునేదానినని శృతి హాసన్ పేర్కొన్నారు. తాను నటిని కాకపోతే సేల్స్ గర్ల్ గా పని చేసేదానినని ఆమె చెప్పుకొచ్చారు. తాను ఏ బట్టల దుకాణానికి వెళ్లినా అక్కడి కస్టమర్లతో ముచ్చటించేదానినని ఆమె అన్నారు.

బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా పని చేయడమంటే తనకు ఇష్టమని శృతి హాసన్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నా ఆలోచన మారిపోయిందని ఆమె అన్నారు. నా మనస్త్వతం సున్నిత మనస్తత్వమని చాలాసార్లు ఏడ్చానని శృతి హాసన్ కామెంట్లు చేశారు. చిన్నచిన్న విషయాలకు ఏడుస్తానని అయితే అందరిలో ఏడవడం ఇష్టం ఉండదని శృతి హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

శంతను ఆర్ట్ వర్క్ నచ్చి ఇన్ స్టాలో ఫాలో అయ్యానని ఆమె అన్నారు. పెళ్లెప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు అలాంటి బోరింగ్ ప్రశ్నలకు సమాధానం చెప్పనని కామెంట్ చేశారు. నేను స్టార్ ను కాదని మా నాన్న పెద్ద స్టార్ అని ఆమె కామెంట్లు చేశారు. నేను సంపాదించింది మాత్రమే నాదని భావిస్తానని శృతి హాసన్ (Sruthi Haasan) పేర్కొన్నారు. నేను వాడిన మొదటి ఫోన్ నోకియా ఫోన్ అని శృతి కామెంట్లు చేశారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus