Sruthi Haasan: ఒంటరిగా ఉన్నప్పుడే ఆ పని చేయగలను.. శృతిహాసన్ కామెంట్స్ వైరల్!

సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శృతిహాసన్ ప్రస్తుతం పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ ఏడాది మొదట్లో శృతిహాసన్ చిరంజీవి బాలకృష్ణ సరసన నటించిన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ రెండు సినిమాలు కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి. త్వరలోనే ప్రభాస్ సరసన నటించిన సలార్ సినిమా ద్వారా శృతిహాసన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇలా కెరియర్ పరంగా శృతిహాసన్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతు ఉంటారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా శృతిహాసన్ (Sruthi Haasan) తరచూ అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఈమె విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటించారు. ఇలా ఎంతోమంది వివిధ రకాల ప్రశ్నలు అడగడంతో ఈమె ఓపికగా సమాధానం చెప్పారు. అయితే ఒక నెటిజన్ మాత్రం మీరు ఏడుస్తారా..

ఏదైనా ఎమోషనల్ సన్నివేశాల గురించి వింటే మీకు ఏడుపు వస్తుందా అంటూ వింత ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ తాను నిజానికి చాలా ఎమోషనల్ పర్సన్ అని ఈమె తెలియజేశారు. సినిమాలు చూస్తున్నప్పుడు ఏదైనా హార్ట్ టచింగ్ సన్నివేశాలు కనుక వస్తే వెంటనే తన కళ్ళల్లో నీళ్లు కారు తాయని తెలిపారు.

ఇక నలుగురితో పాటు కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి సన్నివేశాలు వచ్చిన తనని తాను కంట్రోల్ చేసుకుంటాను కానీ నలుగురిలో తాను ఏడ్చనని అదే ఒంటరిగా గదిలో కనుక ఉంటే మాత్రం ఆ బాధ మొత్తం వెళ్లిపోయే వరకు గట్టిగా ఏడుస్తూ ఉంటానని ఈ సందర్భంగా శృతిహాసన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus