దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో శృతిహాసన్ ఒకరు. కెరియర్ మొదట్లో ఈమె ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్నప్పటీకీ అనంతరం వరుస హిట్ చిత్రాల్లో నటించి తనపై పడిన ముద్రణను చెరపేసుకున్నారు. ఇలా కెరీర్ మంచి పొజిషన్లో ఉండగా ఈమె లండన్ కి చెందిన మైఖేల్ అనే వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు.
ఇతని ప్రేమలో పడిన శృతి హాసన్ కొంతవరకు తన కెరియర్ ని కూడా నిర్లక్ష్యం చేశారు.ఇక వీరిద్దరూ దేశవిదేశాలలో చెట్టా పట్టా లేసుకొని తిరుగుతూ పెద్దఎత్తున రచ్చ చేశారు. ఇక పెళ్లి చేసుకోవాలని భావించిన ఈ జంట వీరి పెళ్ళికి పెద్దలను కూడా ఒప్పించారు. తీరా వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరూ వీరి లవ్ కి బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విధంగా తన ప్రియుడితో బ్రేకప్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయిన శృతిహాసన్
అనంతరం ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికా ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఒకే చోట కలిసి ఉండటమే కాకుండా ముంబై వీధులలో ప్రేమ పక్షులుగా విహరిస్తూ ఉన్నారు. ఇలా ప్రేమలో మునిగి పోయిన ఈ జంట పెళ్లి మాటే ఎత్తడం లేదు. ఈ క్రమంలోనే పెళ్లి ప్రస్తావన రావడంతో శృతిహాసన్ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.తనకు ప్రేమంటేనే హ్యాపీగా ఉందని పెళ్లి అంటే చాలా ఆందోళనగా ఉంది అంటూ ఈమె షాకింగ్ కామెంట్ చేశారు.
ఇలా పెళ్లి విషయానికి వచ్చేసరికి శృతిహాసన్ ఆందోళన చెందడానికి గల కారణాలు ఏమిటి అనే విషయం తెలియక పోయినా పెళ్ళంటే శృతిహాసన్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈమె కెరీర్ విషయానికి వస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్నటువంటి మెగాస్టార్, బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోల సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!