‘బాహుబలి'(సిరీస్) తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ పైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. టాలీవుడ్ తో పాటు ఇండియా మొత్తం… ఈ చిత్రం కోసం ఎదురుచూస్తుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ కు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన రెండు టీజర్లు… ఈ సినిమా పై హైప్ ఏ రేంజ్లో ఉందో చెప్పకనే చెప్పాయి. ఇదిలా ఉండగా.. ఓ విషయంలో అదీ ‘బాహుబలి’ లో ప్రభాస్, రానా ల విషయంలో ఫాలో అయిన ఓ సెంటిమెంట్ నే ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ లో చరణ్, ఎన్టీఆర్ ల విషయంలో ఫాలో అవుతున్నాడు రాజమౌళి.
‘బాహుబలి’ ని తీసుకుంటే… నిజ జీవితంలో రానా కంటే ప్రభాస్ వయసులో పెద్దవాడు. అయితే ఆ సినిమాలో పాత్రలను బట్టి రానా ను పెద్ద వాడిగా… ప్రభాస్ ను చిన్నవాడిగా చూపించాడు మన జక్కన్న. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో కూడా అంతే..! నిజానికి చరణ్ కంటే ఎన్టీఆర్ వయసులో పెద్ద. అయినప్పటికీ ‘ఆర్.ఆర్.ఆర్’ లో చరణ్ .. ఎన్టీఆర్ ను తమ్ముడు అని పిలవడం.. అలాగే ఎన్టీఆర్ చరణ్ అన్న అని పిలవడం…
మనం టీజర్లలో చూసాము. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ అనేది అల్లూరి సీతారామ రాజు అలాగే కొమరం భీమ్ ల జీవితాలను అనుసరించి తీస్తున్న సినిమా కాబట్టి… నిజ జీవితంలో కొమరం భీమ్ కంటే అల్లూరి సీతారామ రాజు వయసులో పెద్ద కాబట్టి.. రాజమౌళి ఆ విధంగా ఫాలో అయ్యి ఉండొచ్చు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?