SS Rajamouli: మహేష్ సినిమాపై రాజమౌళి లేటెస్ట్ అప్డేట్.. వీడియో వైరల్.!

‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) రిలీజ్ అయ్యి 2 ఏళ్ళు దాటింది. అయినా రాజమౌళి  (Rajamouli) ఇంకా తన నెక్స్ట్ సినిమాని మొదలుపెట్టలేదు. మహేష్ బాబుతో (Mahesh Babu) తన నెక్స్ట్ సినిమా అని.. ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ కాకముందే ప్రకటించాడు. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ అడ్వెంచరస్ డ్రామా ఇది అని కూడా హింట్ ఇచ్చాడు. తర్వాత రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) కూడా అది నిజమే అని కన్ఫర్మ్ చేశాడు. కొన్ని నెలల నుండి లొకేషన్స్ వేట కూడా మొదలుపెట్టారు.

క్యాస్టింగ్ ఎంపిక పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల టెస్ట్ షూట్లు నిర్వహించారు. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్..లతో ఆ టెస్ట్ షూట్స్ నిర్వహించినట్టు తెలుస్తుంది. అయితే రాజమౌళికి మళ్ళీ ఏదో లోటు అనిపించినట్లు ఉంది. దీంతో మళ్ళీ రైటింగ్ పనులు మొదలుపెట్టాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయాన్ని అతను తెలియజేశాడు. ‘మీ నెక్స్ట్ సినిమా గురించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వండి?’ అంటూ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకి రాజమౌళి బదులిస్తూ..

‘మహేష్ బాబు.. సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్. అతనితో నా నెక్స్ట్ సినిమా. 3 వారాల నుండి రైటింగ్ పనులు మొదలుపెట్టాను. ‘గ్లొబ్ టాటరింగ్ అడ్వెంచరస్ డ్రామా ఇది. కచ్చితంగా బిగ్గెర్ దేన్ బెటర్ అనే విధంగా ఉంటుంది’ అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆగస్టు నెలలో మహేష్ బాబు పుట్టినరోజు ఉంది కాబట్టి.. ఆ రోజు ఇంకా కొన్ని అప్డేట్స్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus