Rajamouli, Mahesh: మహేష్ – రాజమౌళి.. సినిమా లేటెస్ట్ అప్డేట్..!

  • June 25, 2024 / 01:58 PM IST

‘కల్కి 2898 ad ‘  (Kalki 2898 AD) తర్వాత టాలీవుడ్లో రూపొందనున్న బిగ్ బడ్జెట్ ప్రాజెక్టు ఏదైనా ఉందా అంటే.. అది కచ్చితంగా మహేష్ బాబు (Mahesh Babu)  – రాజమౌళి(Rajamouli) ..ల ప్రాజెక్టు అనే చెప్పాలి. ‘ఆర్.ఆర్.ఆర్’ తో (RRR) ఆస్కార్ అవార్డు అందుకున్న రాజమౌళి.. తెరకెక్కించబోతున్న నెక్స్ట్ మూవీ కూడా ఇదే. అయితే ఈ ప్రాజెక్టు గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) మాత్రం అప్పుడప్పుడు చిన్న చిన్న అప్డేట్లు ఇస్తూ వచ్చారు.

ఈ మధ్య ఆయన కూడా నోరు మెదపడం లేదు. అయితే ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఇది ‘ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో సాగే అడ్వెంచరస్’ మూవీ అని తెలుస్తుంది. మరోపక్క నిర్మాత కె.ఎల్.నారాయణ్ (K.L.Narayana) అయితే, దీనిని ఏడాదిన్నరలో ఫినిష్ చేసి రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ షూటింగ్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. అయితే తాజాగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (MM Keeravani) ఈ ప్రాజెక్టు గురించి స్పందించాడు.

ఈ ప్రాజెక్టు కోసం ఆయన ఇంకా పనులేమీ మొదలుపెట్టలేదట. అయితే ప్రస్తుతానికి కొన్ని టెస్ట్ షూట్స్ నిర్వహిస్తున్నారు రాజమౌళి అని చెప్పారు. అంతకు మించి ఇక ఏమీ చెప్పలేదు. దీనిపై ఇండస్ట్రీలో ఆరా తీయగా.. ఆ టెస్ట్ షూట్స్ క్యారెక్టర్స్ సెలక్షన్ కోసం ముంబైలో నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. క్యాస్టింగ్ పనులు కూడా పూర్తికావచ్చాయని..

ఆ తర్వాత టీం మొత్తంతో రాజమౌళి సెపరేట్ మీటింగ్ పెట్టి.. కథ గురించి ఇంకోసారి వివరిస్తారట. అనంతరం కథ, పాత్రపై.. ఆయన కొన్ని ఎగ్జామ్స్ కూడా పెట్టాలని భావిస్తున్నారట. సో మహేష్ – రాజమౌళి సినిమాకి వర్క్ షాప్స్ ఎక్కువగానే జరుగుతాయన్న మాట. మరోపక్క ఆగస్టు 9 న.. అంటే మహేష్ బాబు పుట్టినరోజుకి ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus