Stalin Collections: ‘స్టాలిన్’ కు 16 ఏళ్లు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టాలిన్’. 2006 వ సంవత్సరం సెప్టెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ‘అందరివాడు’ ‘జై చిరంజీవ’ వంటి చిత్రాలు నిరాశపరిచినప్పటికీ ‘స్టాలిన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.’ఠాగూర్’ చిత్రం మురుగదాస్ కథతో రూపొందిన చిత్రం. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ కారణంగానే ‘స్టాలిన్’ పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఆ అంచనాలను ఈ మూవీ అందుకోలేకపోయినప్పటికీ..

రిలీజ్ కు ముందు ఏర్పడ్డ హైప్ కారణంగా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. సోషల్ మీడియాలో ‘#16YearsForStalin’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో ఈ మూవీ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 7.15 cr
సీడెడ్ 5.38 cr
ఉత్తరాంధ్ర 2.50 cr
ఈస్ట్ 1.80 cr
వెస్ట్ 1.50 cr
గుంటూరు 1.80 cr
కృష్ణా 1.75 cr
నెల్లూరు 1.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 22.96 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 4.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 26.96 cr

‘స్టాలిన్’ చిత్రం రూ.24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ మూవీ రూ.26.96 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కు రూ.2.96 కోట్ల లాభాలను అందించి హిట్ మూవీగా నిలిచింది. కానీ ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మహేష్ బాబు ‘పోకిరి’ కలెక్షన్లను ఈ మూవీ అధిగమించలేకపోయింది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus