రాజ్ తరుణ్ ఇటీవల హీరోగా నటించిన సినిమాలేవీ హిట్ అవ్వలేదు. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకున్న అతను ఈ మధ్యకాలంలో ఒక్క హిట్టు కొట్టడానికి కిందా మీదా పడుతున్నాడు. గతేడాది ‘పవర్ ప్లే’ ‘అనుభవించు రాజా’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యంగ్ హీరో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. అయితే కొంతలో కొంత ‘అనుభవించు రాజా’ చిత్రం బిలో యవరేజ్ అన్నట్టు ఆడింది. దీంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని ఈసారి ‘స్టాండప్ రాహుల్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Click Here To Watch NEW Trailer
టీజర్, ట్రైలర్లు ఇంట్రెస్టింగ్ గానే అనిపించాయి.శాంటో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వర్ష బొల్లమ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదు.
ఒకసారి ఆ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం | 0.70 cr |
సీడెడ్ | 0.22 cr |
ఉత్తరాంధ్ర | 0.25 cr |
ఈస్ట్ + వెస్ట్ | 0.20 cr |
గుంటూరు + కృష్ణా | 0.25 cr |
నెల్లూరు | 0.15 cr |
ఏపి+తెలంగాణ | 1.77 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 0.10 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 1.87 cr |
‘స్టాండప్ రాహుల్’ చిత్రానికి రూ.1.87 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2 కోట్ల మేర షేర్ ను రాబట్టాలి.టార్గెట్ పెద్దది ఏమీ కాదు. పక్కన ‘రాధే శ్యామ్’ తప్ప మరో పెద్ద సినిమా ఏమీ లేదు. కానీ జనాలు ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి మరో పెద్ద సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సినిమాకి టికెట్ పెట్టాలి కాబట్టి.. దీనిని లైట్ తీసుకునే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ చిత్రం ఫైనల్ గా ఎంత రాబడుతుందో చూడాలి..!
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!