రాజ్ తరుణ్ హీరోగా వర్ష బొల్లమ హీరోయిన్ గా శాంటో దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘స్టాండప్ రాహుల్’. మురళీ శర్మ, ఇంద్రజ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ మార్చి 18న విడుదలైంది. టీజర్, ట్రైలర్లు కొంతమేర ప్రేక్షకులని అలరించాయి కానీ థియేటర్ కు మాత్రం తీసుకురాలేకపోయాయి. దానికి తగినట్టే తొలిరోజున ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ ఏమాత్రం నమోదు కాలేదు.
Click Here To Watch NEW Trailer
వీకెండ్ ను ఈ చిత్రం పెద్దగా క్యాష్ చేసుకోలేకపోయింది.ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఓసారి గమనిస్తే :
నైజాం | 0.13 cr |
సీడెడ్ | 0.06 cr |
ఉత్తరాంధ్ర | 0.08 cr |
ఈస్ట్ + వెస్ట్ | 0.06 cr |
గుంటూరు + కృష్ణా | 0.08 cr |
నెల్లూరు | 0.02 cr |
ఏపి+తెలంగాణ | 0.43 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 0.03 cr |
వరల్డ్ వైడ్(టోటల్) | 0.46 cr |
‘స్టాండప్ రాహుల్’ చిత్రానికి రూ.1.87 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2 కోట్ల మేర షేర్ ను రాబట్టాలి.టార్గెట్ చిన్నదే కానీ ఫస్ట్ వీకెండ్ ఈ చిత్రం కేవలం రూ.0.46 కోట్ల షేర్ ను రాబట్టింది. పోటీగా ‘రాధే శ్యామ్’ తప్ప మరో పెద్ద సినిమా ఏమీ లేదు.కానీ బ్యాడ్ టాక్ రావడంతో ఈ చిత్రం చూడ్డానికి జనాలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని స్పష్టమవుతుంది.
బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం మరో రూ.1.54 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో గ్రోత్ చూపించి స్టడీగా రన్ అయితే తప్ప లేదంటే కష్టమే అని చెప్పాలి..!
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!