Stand Up Rahul OTT: స్టాండ్ అప్ రాహుల్.. ఆహాలో సందడి మొదలైంది!

విభిన్నమైన కథనాలతో నిత్యం ఓ వర్గం ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునే అతికొద్ది మంది హీరోలలో రాజ్ తరుణ్ ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి చాలా కష్టపడి పైకి వచ్చిన రాజ్ తరుణ్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అందుకున్నాడు. అలాగే విభిన్నమైన కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా ఓటీటీ లో కూడా రాజ్ తరుణ్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.

ఇక ఈ యువ హీరో నుంచి రేసేంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టాండప్ రాహుల్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి స్టార్ట్ చేసింది. రాజ్ తరుణ్ వర్ష బొల్లమ్మ జంటగా నటించిన స్టాండ్ అప్ రాహుల్ సినిమా మార్చి 18న థియేటర్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ గా సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంది.

ఇక రాజ్ తరుణ్ సరికొత్త కామెడీ టైమింగ్ అలాగే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ సినిమాలో మేజర్ హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాను ఇటీవల ఓటీటీ వరల్డ్ ఆహాలో విడుదల చేయడం జరిగింది. వెండితెరపై నవ్వులు కురిపించిన స్టాండ్ అప్ రాహుల్ ఇప్పుడు డిజిటల్ వరల్డ్ లో కూడా అదే తరహాలో క్రేజ్ అందుకుంటున్నాడు. ఒక విధంగా ఇప్పుడు ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు.

శాంటో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్, హై ఫైవ్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఆహాలో స్టాండ్ అప్ రాహుల్ భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. స్ట్రీమింగ్ అయిన కొద్దీ సేపటికే భారీ స్థాయిలో వీక్షకుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలిసింది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus