ప్రముఖ నటుడు మాజీ భార్యపై హైకోర్టులో ఏం పిటిషన్ వేశారంటే..

సినీ పరిశ్రమలో వరుస ప్రమాదాలు, ప్రేమలు, పెళ్లిళ్లు, రిలేషన్స్, బ్రేకప్స్, విడాకులు.. ఇలాంటి షాక్‌కి గురిచేసే గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్‌లు వినిపిస్తూనే ఉన్నాయి.. గతంలో నిశ్చితార్థం చేసుకుని త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన విద్యుత్ జమ్వాల్, ఫ్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీతో తెగదెంపులు చేసుకున్నాడు.. ఇక కొద్దికాలంగా వివాదాల్లో నిలుస్తున్న మరో జంట గురించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.. ప్రముఖ బాలీవుడ్ నటుడు (Actor) నవాజుద్దీన్ సిద్ధిఖీపై అతని మాజీ భార్య అంజనా పాండే అలియాస్ ఆలియా కొద్ది కాలంగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు..

నవాజుద్దీన్, ఆలియా 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. 2020లో నవాజుద్దీన్‌ – ఆలియా విడిపోయారు. తర్వాత మనుసు మార్చుకుని తిరిగి భర్తతో కలసి ఉంటున్నారు.. అయితే కొద్ది కాలంగా ఆలియాకి, నవాజుద్దీన్ తల్లి మొహ్రూనిసాకి మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయని సమాచారం.. ఆలియా మీద మొహ్రూనిసా కేసు పెట్టారు.. ఆలియా, తనకు కనీసం అన్నం కూడా పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు..

తనను వంటగదిలోకి రానివ్వడం లేదని, ఆఖరికి ఆన్‌‌లైన్ ఫుడ్ డెలివరీ చేసేవాళ్లను కూడా రాకుండా చేస్తున్నారని ఆలియా ఆరోపించారు.. ఇదిలా ఉంటే.. ఈ జంట కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారని తెలుస్తోంది.. రీసెంట్‌గా నవాజుద్దీన్ తన మాజీ భార్య అంజనా పాండేకు ఊహించని షాక్ ఇచ్చారు.. తన పరువుకి భంగం కలిగించేలా వ్యవహరిచారని అంజనా పాండే, సోదరుడు షంసుద్దీన్ మీద రూ. 100 కోట్లు పరువు నష్టం దావా వేశారు..

అంజనా, షంసుద్దీన్ ఇద్దరూ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేయకూడదని.. ఇప్పుడు పెట్టిన పోస్టులను తొలగించాలని బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు నవాజుద్దీన్.. ఇప్పుడీ వార్త గురించి హిందీ చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. కొద్ది రోజుల్లో కోర్టు తీర్పు రానుంది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus