చిత్ర పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉన్నాం. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు లేదంటే వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. కొందరు అనారోగ్య సమస్యలతో, ఇంకొందరు వయసు సంబంధిత సమస్యలతో.. లేదంటే కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న సందర్భాలను కూడా మనం చూస్తూనే వస్తున్నాం. ఇటీవల మమ్ముట్టి సోదరి కన్నుమూసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత నిర్మాత గోగినేని ప్రసాద్ కూడా కన్నుమూశారు. ఆ షాక్ ల నుండీ ఇంకా సినీ పరిశ్రమ కోలుకోకుండానే మరో షాకింగ్ న్యూస్ వినాల్సి వచ్చింది. తాజాగా ఒక సీనియర్ నటుడు కన్నుమూసినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే… బాలీవుడ్ సీనియర్ నటుడు అఖిల్ మిశ్రా కన్నుమూశారు. ఆయన వయస్సు 58 యేళ్ళు. ఈయనకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కానీ… మరణించడానికి కారణం అది కాదు. కిచెన్ లో ఆయన ఊహించని విధంగా కాలు జారి పడ్డాడు.
దీంతో ఆయనకు (Akhil Mishra ) బలమైన గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది అని తెలుస్తుంది. చికిత్స పొందుతూనే అఖిల్ మిశ్రా కన్నుమూశారు అని సమాచారం. బాలీవుడ్లో అఖిల్ మిశ్రా త్రీ ఇడియట్స్ సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో అఖిల్ మిశ్రా లైబ్రేరియన్ దూబె పాత్ర పోషించారు. ఆయన మరణవార్త ఇండస్ట్రీ జనాలను కలచివేసింది అని చెప్పాలి
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!