కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ యాంకర్, నటుడు ఆనంద కణ్ణన్ అనారోగ్య సమస్యల వల్ల కన్నుమూశారు. యాంకర్ గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆనంద కణ్ణన్ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. వారం రోజుల క్రితం ఆనంద కణ్ణన్ ఆరోగ్యం క్షీణించగా కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు. క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటూ కోలుకోలేక ఆనంద కణ్ణన్ చనిపోయారు.
సింగపూర్ లో వసంతం అనే టీవీ ఛానెల్ ద్వారా వీజేగా ఆనంద కణ్ణన్ కెరీర్ ను మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆనంద కణ్ణన్ చెన్నైలో స్థిరపడ్డారు. సన్ టీవీలో ప్రసారమైన సింధ్‌బాద్ అనే సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించడం ద్వారా పిల్లలు, యువతకు ఆనంద కణ్ణన్ చేరువయ్యారు. ఆనంద కణ్ణన్ మృతితో కోలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న సమయంలో కూడా ఆనంద కణ్ణన్ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
యూత్ ఐకాన్ గా పేరు తెచ్చుకున్న ఆనంద కణ్ణన్ మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆనంద కణ్ణన్ సినీ రంగానికి సేవలు అందించారు. ఆనంద కణ్ణన్ నటించిన సరోజ, అదిసయ ఉల్గం సినిమాలు రిలీజ్ కు నోచుకోలేదు. ఆనంద కణ్ణన్ ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు ఆనంద కణ్ణన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.