సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎస్.కె.ఎన్ (Sreenivasa Kumar Naidu) తండ్రి , ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్,సీనియర్ హీరో వేణు (Venu Thottempudi) తండ్రి, అలాగే దర్శకుడు వెట్రి దురై, సింగర్ విజయలక్ష్మి అలియాస్ మల్లికా రాజ్ పుత్,’దంగల్’ నటి అయిన సుహానీ భట్నాగర్, ప్రముఖ రచయిత కమ్ నిర్మాత అయిన వి.మహేశ్, దర్శకుడు చిదుగు రవిగౌడ్, ‘మొగలిరేకులు’ ఫేమ్ పవిత్ర నాథ్,దర్శకుడు కమ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్య కిరణ్ (Surya Kiran), కోలీవుడ్ కమెడియన్ శేషు,డేనియల్ బాలాజీ (Daniel Balaji) , రచయిత శ్రీ రామకృష్ణ,సీనియర్ కమెడియన్ విశ్వేశ్వరరావు,బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్, నిర్మాత అయిన గంగూ రామ్ సే.. వంటి వారు మరణించారు.
ఈ షాక్..ల నుండీ సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే… ప్రముఖ నటుడు ‘సింహం’ ఫేమ్, అన్నాడీఎంకే స్టార్ స్పీకర్ అరుళ్మణి మృతి చెందారు. గురువారం రాత్రి చెన్నైలో ఉన్న ఆయన నివాసంలో గుండెపోటు సంభవించడంతో కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూనే అరుళ్మణి మరణించారు అని స్పష్టమవుతుంది.
ఆయన వయసు 65 సంవత్సరాలు. అరుళ్మణి పలు సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే సినిమాల్లో కూడా ఛాన్సులు సంపాదించుకుని విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ‘అలకి’ ‘పొన్నుమణి’ ‘కరుపు రోజా’ ‘వేల్’ ‘తెనారల్’ ‘మదురమలై’ ‘కత్తు తమిళ్’ ‘వన యుద్ధం’ ‘సింగం 2 ‘ ‘లింగ’ (Lingaa) వంటి సినిమాల్లో అరుళ్మణి నటించారు.