షూటింగ్ అనేది సజావుగా జరగాలి అంటే సెట్ లో ఉన్న వాళ్ళందరి సహకారం కావాలి. ఇందుకు హీరోలు, హీరోయిన్లు అతీతం కాదు. తాజాగా జరిగిన ఓ సంఘటనని దీనికి పెద్ద ఉదాహరణగా చెప్పుకోవాలి. విషయం ఏంటి అంటే సెట్‌లో యూనిట్ సభ్యులను భూతులు తిట్టాడు అని హీరోని.. ఆ యూనిట్ సభ్యులు చితక్కొట్టారు. ఓ బుల్లితెర హీరో, నటుడుపై సిబ్బంది చేయి చేసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అయ్యే సావిత్రమ్మ గారి అబ్బాయితో పాపులర్ అయ్యాడు నటుడు చందన్ కుమార్. టీవీ సీరియల్స్ చూసేవారికి ఇతన్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘శ్రీమతి శ్రీనివాస్’ అనే మరో సీరియల్లో కూడా అతను లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సీరియల్ కు సంబంధించిన షూటింగ్లో చందన్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడట. ఓ టెక్నిషియన్‌ను ఇతను నోటికొచ్చిన బూతులు తిట్టాడని, ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకోవడంతో యూనిట్ సభ్యులు తిరగబడినట్టు స్పష్టమవుతుంది.
తన తల్లిని ఉద్దేశిస్తూ చందన్ కుమార్ ఘోరమైన కామెంట్లు చేసాడని సెట్ లో ఉన్న టెక్నీషియన్ విరుచుకుపడ్డాడు. అటు తర్వాత యూనిట్ సభ్యులంతా ఏకమయ్యి ఆ టెక్నీషియన్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చందన్ సీరియల్స్ లో మాత్రమే కాదు సినిమాల్లో కూడా నటించాడు. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్యతో ‘ప్రేమ బరహా’ అనే చిత్రంలో నటించాడు.
ఈ మూవీలో అతను హీరోగా నటించడం విశేషం. హీరోగా క్లిక్ అవ్వకపోవడంతో ‘రాధా కళ్యాణ’, ‘లక్ష్మీ బారమ్మ’ వంటి కన్నడ సీరియల్స్‌లో నటించి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో తెలుగు సీరియల్స్ లో చాలా వరకు కన్నడ ఆర్టిస్ట్ లనే ఎంపిక చేసుకుంటున్న సందర్భాలను మనం చూశాం.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?