Priyanka Chopra: ప్రియాంక తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడానికి అదే కారణం అంటున్న నటుడు!

ప్రియాంక చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు హీరో రాంచరణ్ తో తప్ప మరో హీరోతో నటించలేదు. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే ఈమె గ్లోబల్ హీరోయిన్ అయిపోయింది ఇప్పుడు. సో ఆమె అందరికీ చాలా స్పెషల్. ఇదిలా ఉండగా.. ప్రియాంక, సామ్ హ్యూగన్ లీడ్ రోల్స్‌లో ‘లవ్ ఎగైన్’ అనే రొమాంటిక్ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక భర్త నిక్ జోనస్ కూడా ఓ స్పెషల్ రోల్‌లో కనిపించాడు.

జేమ్స్ సీ స్ట్రౌస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12 న రిలీజ్ అయ్యింది. ఇటీవల సామ్ హ్యూగన్ తన సహనటి (Priyanka Chopra) ప్రియాంక చోప్రాపై గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు.’ ప్రియాంకకు నేను పెద్ద ఫ్యాన్. అందువల్ల ఆమె ఈ ప్రాజెక్టులో భాగమవుతుందని తెలిసినప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యాను. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. ‘మేము కలిసి తాగేవాళ్లం! అయితే లాక్‌డౌన్ సమయంలో లండన్‌లో షూట్ చేశాం.

సెట్‌లో చాలా కొవిడ్ నిబంధనలు పాటించాల్సి రావడంతో చాలా కష్టమనిపించింది. ఈ క్రమంలో ప్రియాంక అవుట్‌డోర్స్‌లో మా కోసం చిన్న చిన్న ఫన్ పార్టీలు అరేంజ్ చేసింది.ఆ క్రమంలో కూడా మధ్య కెమిస్ట్రీ డెవలప్ కావడంతో పాటు కాస్ట్ అండ్ క్రూ అందరి మధ్య బాండింగ్ పెరగడంలో అది సాయపడింది’ అంటూ అతను చెప్పుకొచ్చాడు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus